Sunday, December 22, 2024
spot_img
HomeNewsరారా చూసుకుందాం - ఉగ్ర రూపంలో రేవంత్ రెడ్డి

రారా చూసుకుందాం – ఉగ్ర రూపంలో రేవంత్ రెడ్డి

రారా చూసుకుందాం
ఉగ్ర రూపంలో రేవంత్ రెడ్డి

చింత చచ్చిన పులుపు చావలేదు అన్నట్లు ,బొక్క బోర్లా పడ్డా బీఆర్ఎస్‌కు బుద్ధి లేదు సిగ్గు శరం లేదు అంటూ ఫైర్ అయ్యారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
అసెంబ్లీ సమావేశంలో ఈరోజు బీఆర్ ఎస్ పార్టీ తీరు మీద, కేసీఆర్ మీద మాటలతో విరుచుకుపడ్డారు సీఎం రేవంత్ . నేను మాట్లాడిన బాష గురించి మాట్లా డే ముందు మాజీ సీఎం కెసిఆర్ మాట్లాడిన బాష మీద చర్చ చేద్దామా అంటూ పిలుపునిచ్చారు సీఎం .
ఒకానొక టైంలో రారా చూసుకుందాం అంటే చూసుకుందాం అంటూ సవాల్ విసిరారు.తెలంగాణ రాష్ట్ర ప్రజల పట్ల, యావత్ తెలంగాణ రైతులపట్ల గౌరవం అభిమానం ఉంటే ,ప్రధాన ప్రతిపక్షం అయిన బీఆర్ఎస్‌ సభ్యులు మేడిగడ్డ కు వచ్చేవారు అని సీఎం రేవంత్ అన్నారు
అసలు కుంగిన మేడిగడ్డ బ్యారేజిలో లో నీళ్ళు నింపే పరిస్థితి ఉందా…కుంగింది రెండు పిల్లర్లు అయితే కనీసం వాటి మీద మాట్లాడ్డానికి అయినా కేసీఆర్ అసెంబ్లీ సభా సమావేశానికి రావాలని పిలుపు నిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.
కడియం శ్రీహరి, హరీష్రావు,కల్వకుంట్ల కుటుంబానికి పెత్తనం ఇస్తాం.. మేడిగడ్డ బ్యారేజిలో నీళ్లు నింపి చూపించండి అంటూ సవాల్ చేశారు రేవంత్ .
సాగునీటి ప్రాజెక్టులపై శ్వేత పత్రం పెట్టడానికి కాంగ్రెస్స్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని,కాళేశ్వరంపై కూడా మేం చర్చకు సిద్ధంగా ఉన్నాం ,దమ్ముంటే సభకు వచ్చి మాట్లాడాలని సీఎం రేవంత్ అన్నారు.
మూడు రోజుల పాటు సభలో అన్ని విషయాలు చర్చించుకుందాము అనుకొన్నాము . మేడిగడ్డ బ్యారేజి చూసి వచ్చిన తరువాత చర్చ చేద్దాం…పోదాం అన్నాను .మేడిగడ్డ సందర్శనకు పిలిస్తే బారాసా నాయకులు రాలేదు.
ఏదైనా సభా సమావేశంలో మాట్లాడితే కొత్తగా వచ్చిన ప్రభుత్వానిదే తప్పు అని మాట్లాడుతున్నారు అంటూ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చర్చలకు సిద్ధమైతే మీ సభాపక్ష నేత కెసిఆర్ను అసెంబ్లీకి రమ్మని చెప్పండి అంటూ కడియం శ్రీహరికి చురకలు అంటించారు సీఎం రేవంత్.
పోయి పోయి పారిపోయి అక్కడెక్కడో ప్రగల్భాలు వాగడం కాదు..అంటూ ఎద్దేవా చేశారు.
పదే పదే బీఆరెస్ నేతలు నా భాష గురించి మాట్లాడుతున్నారు..మాజీ సీఎం కెసిఆర్ మీ దళపతి నిన్న నల్లగొండలో మాట్లాడిన భాషపై చర్చిద్దామా? ఒక రాష్ట్ర సీఎంను పట్టుకుని ఏం పీకనీకి పోయారు అన్నది కెసిఆర్ ,మరి వాళ్ళు మాట్లాడాల్సిన బాష అదేనా అని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి.
తెలంగాణ ప్రజలు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మీతోక కట్ చేసారు అయినా మీకు బుడ్డి రాలే .పైగా మా నాయకుడు కెసిఆర్ ని చంపడానికి చూస్తున్నారా అంటూ మాపై నిందలు వేస్తున్నారా అని సీఎం రేవంత్ ప్రశ్నించారు .
గులాబీ దళపతి కేసీఆర్‌ని వేరేగా ఎవరు చంపక్కర్లేదు.. మొన్న జరిగిన అసెబ్లీ ఎన్నికల్లో కెసిఆర్ చచ్చిన పాము ఆ చచ్చిన పాముని మేము మళ్ళీ చంపాలా అంటూ కామెంట్ చేశారు సీం రేవంత్ రెడ్డి.
తెలంగాణ ప్రజల మీద ఏమాత్రం గౌరవం ఉన్న కెసిఆర్ అసెంబ్లీ సభకు వచ్చి సాగునీటి ప్రాజెక్ట్లమీద చర్చించాలి అని అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి అన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments