Sunday, December 22, 2024
spot_img
HomeNewsAndhra PradeshRBI : పిలవని పేరంటానికి నేనూ వస్తా .. అంటున్న లక్ష్మి పార్వతి !?

RBI : పిలవని పేరంటానికి నేనూ వస్తా .. అంటున్న లక్ష్మి పార్వతి !?

ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సమయం లో కేంద్రం ప్రత్యేకంగా ఆర్బీఐ ద్వారా రూ. వంద నాణెం నందమూరి గౌరవార్ధం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ద్వారా విడుదల చేస్తున్నారు. ఆగష్టు 28 వ తేదీన జరగనున్న ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబసభ్యులతో పాటు ఆయనతో అనుబంధం ఉన్న మొత్తం వంద మంది హాజరవుతారు. ఈ జాబితా చాలా కాలం కిందటే ఫైనల్ అయి అధికారికంగా ఆహ్వానాలు కూడా వెళ్లాయి. చంద్రబాబు, ఎన్టీఆర్,కల్యాణ్ రామ్ సహా అందరూ వెళ్తున్నట్లు సమాచారం. పురందేశ్వరికి మొత్తం ఈ కార్యక్రమ క్రెడిట్ దక్కుతుంది.

అయితే లక్ష్మిపార్వతి తనను కూడా ఆహ్వానించాలని రాష్ట్రపతికి లేఖ రాశారు. తాను ఎన్టీఆర్ భార్యనని చెప్పుకుంటున్నారు. ఎన్టీఆర్ రెండవ భార్యని కాబట్టి తనను కూడా పిలవాలని ఆమె అడుగుతున్నారు. కానీ ఆమెకు ఆహ్వానం పంపనప్పుడే ఆమెను పిలవడం ఇష్టం లేదని … అర్థం అవుతుంది. మరి ఇలాంటి లేఖలు రాయడం వల్ల ఏం సాధిస్తారు అనేది ఆమెకే తెలియాలి. ఎన్టీఆర్ తో లక్ష్మిపార్వతి పెళ్లిని… ఎన్టీఆర్ కుటుంబంలో ఒక్కరూ అంగీకరించలేదు. ఆమెను గుర్తించలేదు.

YS jagan with Laxmiparvati

చివరికి… వైసీపీలో చేరి ఎన్టీఆర్ కుటుంబసభ్యులపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంటారు లక్ష్మిపార్వతి, చివరికి ఎన్టీఆర్ ను అవమానించినా .. .మంచిపనే అనే స్థాయికి ఆమె వెళ్లారు . అయినా సరే తగుదునమ్మా అని తనను కూడా పిలవాలని రాష్ట్రపతికి లేఖ రాశారు. ఈమె లేఖ పట్ల సర్వత్రా నవ్వులు వినపడుతున్నాయి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments