Sunday, December 22, 2024
spot_img
HomeElections 2023-2024Sita Dayakar Reddy అడుగులు కాంగ్రెస్ వైపే ...!?

Sita Dayakar Reddy అడుగులు కాంగ్రెస్ వైపే …!?

Sita Dayakar Reddy Entry in to Congress?

 రెండు రోజుల క్రితం గులాబీ బాస్ 115 మంది  అభ్యర్థులను ప్రకటించి ప్రధాన పోటీదారు కాంగ్రెస్ కు సవాల్ విసిరారు . ఇంకా 20 నుంచీ 30 గెలుపు గుర్రాల అన్వేషణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ని ఒకింత ఒత్తిడి లోకి నెత్తినట్లయుండి . సీటింగ్ MLA లు జంప్ జిలానీలు గా మారకుండా వారికే టికెట్ ఇట్చి కాంగ్రెస్ కు సవాల్ విసిరారు . దీనితో రేవంత్ రెడ్డి స్వంత జిల్లా ఆయన ఉమ్మడి  పాలమూరులో అభ్యర్థుల వేటలో కాంగ్రెస్ పడింది . 

ఇటివలే మరణించిన మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి సతీమణి, మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డి (Sitadayakar reddy) కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని ,  ఈ మేరకు ఆమె కాంగ్రెస్ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం వినవస్తోంది. ఆమె కాంగ్రెస్‌లో చేరితే పార్టీ బలోపేతం ఖాయమని ఆ పార్టీ శ్రేణులు ఇప్పటికే లెక్కలు వేసుకుంటున్నాయి. నిజానికి ఉమ్మడి పాలమూరు జిల్లా లో దయాకర్ రెడ్డి, ఆయన సతీమణి సీతా దయాకర్ రెడ్డి లది ఘనమైన రాజకీయ చరిత్ర . వారు సుదీర్ఘకాలంపాటు టీడీపీలో ఉన్నారు . సీతా దయాకర్ రెడ్డి కూడా భర్తకు తోడుగా రాజకీయాల్లో  2002లో పాలమూరు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. 

ఆ తర్వాత 2009లో దేవరకద్ర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రాష్ట్ర విభజన అనంతరం కూడావారివురూ  టీడీపీలో కొంతకాలం కొనసాగారు. అయితే గతేడాది  తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఏ పార్టీలోనూ చేరకుండా ఉన్నారు. అనంతరం అనారోగ్యంతో కొత్తకోట దయాకర్ రెడ్డి ఇటీవల కన్నుమూశారు . ఆయన అంత్యక్రియలకు చంద్రబాబు హాజరయి పాడే మోసిన సంగతి తెలిసిందే .

CBN at Kottakota Last rites

ఇక సీతా దయాకర్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్తు పై ఒక నిర్ణయం తీసుకోబోతున్నారని , ఆమె అభిమానులు కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరమని ఒత్తిడి తీసుకువస్తున్నట్లు వార్తలు వినబడుతున్నాయి .  Kottakota కుటుంబానికి మక్తల్ , దేవరకద్ర నియోజక వర్గాల్లో పట్టు వున్నా సంగతి తెలిసిందే . టీపీసీసీ అధ్యక్షుడి తో గల సాన్నిహిత్యం తో రేవంత్ రెడ్డి పలు దఫాలు కొత్తకోట కుటుంబం తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది . రాబోయే వారం రోజుల్లో సీతా  దయాకర్ రెడ్డి ఢిల్లీ లో ఖర్గే నేతృత్వాన కాంగ్రెస్ లో చేరడానికి రంగం సిద్ధం అవుతున్నట్లు వినికిడి . 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments