Sunday, December 22, 2024
spot_img
HomeElections 2023-2024సంచలన నిర్ణయం దిశగా “కొండా విశ్వేశ్వర్ రెడ్డి …. !?

సంచలన నిర్ణయం దిశగా “కొండా విశ్వేశ్వర్ రెడ్డి …. !?

Hyderabad: ఉమ్మడి రంగారెడ్డి పై కాంగ్రెస్ పట్టు కోసం కాంగ్రెస్ తన ప్రయత్నాలు తీవ్రం చేసింది . ఎన్నికల ముంగిట తెలంగాణా లో రాజకీయాలు ఎన్నడూ చూడని విధం గా వేడెక్కాయి.  పార్టీ మారెండుకు ఏ చిన్నపాటి అవకాశం వున్నా , అగ్ర నేతలు ఎకాఎకీ వారి ఇంటికి వెళ్లి కండువాలు కప్పుతున్న వైనం తెలిసిందే . తెలంగాణ లో ప్రభత్వ ఏర్పాటే ఏకైక లక్ష్యం గా కాంగ్రెస్ తన అడుగులు వేస్తోంది . కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుమోలు అమలుపరుస్తున్న ఆపరేషన్ తెలంగాణ సత్ఫలితాలనే ఇస్తోంది . 

ఉమ్మడి ఖమ్మం , నల్గొండ , మహబూబ్నగర్ జిల్లాలపై పట్టు బిగించిన కాంగ్రెస్ ఇక ఉమ్మడి కరీంనగర్ , రంగారెడ్డి జిల్లాలపై దృష్టి సారించింది . అందులో భాగం గా మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ని కాంగ్రెస్ లోకి చేర్చుకొన్న విషయం తెలిసిందే . ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా లో బలమైన నేత మాజీ ఎంపీ ఆయన కొండా విశ్వేశ్వర రెడ్డి భాజాపా నుంచీ కాంగ్రెస్ లోకి మారే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది . జనసేన తో పొత్తులో భాగం గా భాజాపా 9 నుంచీ 11 స్థానాలు కోల్పోయే అవకాశాలు స్పష్టం గా వున్నాయి . దేనితో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కూకట్ పల్లి , శేరిలింగంపల్లి , lb నగర్ లాంటి చోట్ల భాజాపా ఆశావహుల నుంచీ తీవ్రమైన ఒత్తిడి కొండా విశ్వేశ్వర రెడ్డి పై పడింది .

కొండా కాంగ్రెస్ లో చేరితే  ఆయనకు  పట్టు వున్న చేవెళ్ల లోకసభా పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో  5 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయ అవకాశాలు మెరుగు పడనున్నాయి .  ఇక తెలంగాణ భాజాపా సీనియర్ నేతలు కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి , ఏనుగు రవీందర్ , రేవూరి ప్రకాష్ రెడ్డి , వివేక్ లు  ఒక్కొక్కరుగా పార్టీ ని వీడడం తో కొండా కూడా ఆ బాట లోనే పయనిస్తారని తెలుస్తోంది . 

  • కొండా విశ్వేశ్వర రెడ్డి కి ఈటెల రాజేందర్ సతీమణి జమున రెడ్డి  సమీప బంధువు  కావడం తో … ఆ ప్రభావం ఈటెల దంపతుల పై పడే అవకాశం కూడా లేక పోలేదు . 
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments