Sunday, December 22, 2024
spot_img
HomeNewsAndhra Pradeshకోడికత్తి కేసు నుంచి దళిత బిడ్డ శ్రీనివా్‌సకు విముక్తి కల్పించాలి ...వర్ల రామయ్య

కోడికత్తి కేసు నుంచి దళిత బిడ్డ శ్రీనివా్‌సకు విముక్తి కల్పించాలి …వర్ల రామయ్య

Mangalagiri: కోడికత్తి కేసు నుంచి దళిత బిడ్డ శ్రీనివా్‌సకు విముక్తి కల్పించాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య కోరారు. ముఖ్యమంత్రి జగన్‌ కోర్టుకు వస్తేనే కోడి కట్టి కేసులో శ్రీనివాస్ లు విముక్తి కలుగుతుందని ఆయన అన్నారు . శ్రీనివాస్‌ బెయిలుపై బయటకొస్తే జగన్‌ కోడి కత్తి , అసలు నిజం బయటపడుతుందని జగన్ తో పాటు ఇతర కుట్రదారులు పన్నిన పన్నాగమే ఇదని వర్ల విమర్శించారు.

ఏం పెద్ద నేరం చేశాడని 1,685 రోజులు జైల్లో ఉంచారని ప్రశ్నించారు. ప్రజల్లో సానుభూతి పొంది జగన్‌ను అధికార పీఠం ఎక్కించాలనే కుట్రలో సమిథైన శ్రీనివాసి కు ఈ సీఎం ఇచ్చే బహుమానం ఇదేనా ? అ ‘‘కోడికత్తితో జగన్‌ భుజంపై గుచ్చినందుకే ఏళ్ల తరబడి రిమాండ్‌లో ఉంచాలా..? గొడ్డళ్లతో తల నరికిన వాళ్లు మాత్రం వెంటనే బయటకు వస్తారు. ఇదెక్కడి న్యాయం? శ్రీనివాస్‌ దళితుడు కాబట్టే 1685 రోజులుగా జైల్లో ఉంటున్నాడు. మన దేశంలో దళితులకు ఇంకా పూర్తి స్వాతంత్య్రం రాలేదు’’ అని వర్ల రామయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీలో ఉన్న దళిత ఎమ్మెల్యేలు, మంత్రులకు దళితుడైన శ్రీనివాస్‌ కష్టాలు కనిపించవా? అంటూ వర్ల విమర్శించారు .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments