తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ స్థానంలో కేంద్ర భాజాపా నిర్ణయం తో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ని నియమించారు . వారి అభిప్రాయం అందరిని వెంట తీసుకెళ్లగల “మృదువైన” నాయకుడు కిషన్ రెడ్డి అని . BRS నుండి BJP లోకి మారిన ఈటెల రాజేందర్‌ను తెలంగాణ భాజాపా ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్‌పర్సన్‌గా నియమించారు .
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఈ రోజు నాంపల్లిలోని భాజాపా పార్టీ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జవదేకర్, తరుణ్ చుగ్, ఎంపీ బండి సంజయ్ , ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, సీనియర్ నేత విజయశాంతి హాజరు అయ్యారు . ప్రమాణ స్వీకారానికి ముందు కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వేదపండితుల నుంచి కిషన్‌రెడ్డి ఆశీర్వాదం పొందారు .
చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయాన్ని కిషన్ రెడ్డి సందర్శించారు. భాగ్యలక్ష్మి ఆలయంలో ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు వెంట రాగా ఆయన ప్రత్యేక పూజల్లో చేశారు. ఓ కార్యకర్త ఇచ్చిన కత్తిని పట్టుకుని చార్మినార్ వైపు చూపించడం విశేషం . అనంతరం ర్యాలీగా బయలుదేరి అంబర్‌పేటలోని మహాత్మా ఫూలే విగ్రహానికి నివాళులర్పించి , అక్కడి నుంచి బషీర్ భాగ్ లోని కనకదుర్గ ఆలయం లో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. తదుపరి ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అసెంబ్లీ ఎదురుగా ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు.