రాబోయే లోక్ సభ ఎన్నికల్లో పోటీచేయటానికి తెలంగాణా కాంగ్రెస్ లో రోజు రోజుకి పోటీ పెరిగిపోతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కూడా అన్నీస్ధానాల్లో గెలుస్తామనే ధీమా కాంగ్రెస్ నాయకుల్లో ఉంది . ఈ ధీమా తోనే 17 స్ధానాల్లో గెలుస్తాము అనే నమ్మకంతోనే సీనియర్ల నుండి కొత్తగాపార్టీలో చేరిన వారి సైతం ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు . కాంగ్రెస్ నేతలు టికెట్ కోసం బాగా పోటీపడే నియోజకవర్గాల్లో ముఖ్యమైన నియోజకవర్గం సికింద్రాబాద్ ఎంపీ స్తానం కూడా ఒకటి.ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ కిషన్ రెడ్డి బీజేపీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం మీకు తెలిసిందే . వచ్చే ఎంపీ ఎన్నికల్లో బారాసా తరపున ఎవరు ప్రాతినిధ్యం వహిస్తారు అనేది ఇంకా సస్పెన్స్కుతెర పడలేదు .
ఈ క్రమంలో భాగంగా కాంగ్రెస్ తరపున మాత్రం చాలామంది సికింద్రాబాద్ నుంచి పోటీకి సిద్ధం అవుతున్నారు. ఈమధ్యకాలంలో బారాసాని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, రీసెంట్ గ చేరిన డిప్యుటి మేయర్ శ్రీలతా శోభన్ రెడ్డి ఇద్దరు సికింద్రాబాద్ ఎంపీ టికెట్ కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. వీరి ఇరువురుతో పాటు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ లోకల్ కార్పొరేటర్లు, మాజీ ఎంఎల్ఏలు చాలామంది. సికింద్రాబాద్ ఎంపీ టికెట్ కావాలని లాబీయింగ్ చేస్తున్నట్లు సమాచారం.గమనించాల్సిన అంశం ఏమిటంటే వీరందరూ ముందుగా రేవంత్ రెడ్డిని కలిసి సికింద్రాబాద్ టికెట్ అడుగుతున్నారు. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్ళి ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, ఇన్చార్జీలతో ఉన్న పరిచయాలను అడ్డంపెట్టుకుని టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు .
నిజం చెప్పాలి అంటే బొంతు రామ్మోహన్, శ్రీలత దంపతులు ముందుగానే కేసీయార్, కేటీయార్ ను కలిసి సికింద్రాబాద్ లేదా మల్కాజ్ గిరి టికెట్లు కావాలని అడిగారు అని సమాచారం . మేయర్ దంపతులకు సికింద్రాబాద్ ఎంపీ టికెట్ విషయంలో కేసీయార్, కేటీయార్ నిరాకరించటంతో వెంటనే కాంగ్రెస్ లో చేరిపోయారు . కాంగ్రెస్ పార్టీలో చేరేముందే టికెట్ విషయంలో మేయర్ బొంతు రాంమోహన్ దంపతులు కాంగ్రెస్ పార్టీలోని బడా నేతల దగ్గర హామీ తీసుకుని జాయిన్ అయినట్లు పార్టీవర్గాలు చెప్పాయి. గ్రేటర్ హైదరాబాద్ లో మంచి పట్టు ఉన్న మేయర్ బొంతు రాంమోహన్ కు సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఇస్తే కిషన్ రెడ్డి పై భారీ మెజారిటీ తో గెలిచి సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాన్ని సీఎం రేవంత్ రెడ్డికి బహుమతిగా ఇవ్వొచ్చు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు . వన్ మ్యాన్ షో రేవంత్ రెడ్డి మ్యానియాతో ఈ సారి ఎంపీ ఎలక్షన్స్ లో కిషన్ రెడ్డి కంచుకోట సికింద్రాబాద్ కాళీ అవ్వటం కాయం ,కాంగ్రెస్ గెలవటం తథ్యం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు .