కాంగ్రెస్‌లో ఖమ్మం ఎంపీ టికెట్ పంచాయతీకి ఇంకా ఒక కొలిక్కి రాలేదు . ఇప్పటికే ఖమ్మం ఎంపీ టికెట్ కోసం ఇద్దరు మంత్రులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క , రెవిన్యూ శాకా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పోటీ పడుతున్న విషయం విదితమే . కాగా తాజాగా కాంగ్రెస్ హైకమాండ్ రాహుల్ గాంధీని ఖమ్మం నుంచి ఎంపీగా పోటీ చేయించాలని భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది . దీనిపై ఏఐసీసీ నుంచి అధికారిక ప్రకటన ప్రకటించాల్సి ఉంది .తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎన్నికల్లో గెలుపుపై కసరత్తు చేస్తుంది . ముఖ్యముగ ఎంపీ అభ్యర్థులపై కసరత్తు చేస్తోంది. ఈ సమయంలో ఖమ్మం ఎంపీ అభ్యర్థి ప్రకటన కాంగ్రెస్ పెద్దలకు పెద్ద తలనొప్పిగా మారిందని ప్రచారం జరుగుతోంది , దీనికి ముఖ్య కారణం తెలంగాణ కాంగ్రెస్ ముగ్గురు మంత్రుల కుటుంబ సభ్యులు ఖమ్మం లోక్ సభ టికెట్ రేసులో ఉండడమే. కాంగ్రెస్ పార్టీ అడ్డా ఖమ్మం గడ్డ అలాంటిది కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఖమ్మంలో పార్టీ క్యాడర్ ను కాపాడుకునేందుకు త్వరలో కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయంతీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
ఖమ్మం ఎంపీ టికెట్ పుణ్యమా అని ఇద్దరు మంత్రుల మధ్య రచ్చ రచ్చ అవుతుంది ,ఎంపీ ఎన్నికల్లో విజయ బావుటా ఎగుర వెయ్యాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఖమ్మంలోక్ సభ టికెట్ తలనొప్పిగా మారింది. ఖమ్మం ఎంపీ సీటుపై డిప్యూటీ సీఎం భట్టి , మంత్రి పొంగులేటి ఇద్దరి మధ్య వార్ నెలకొన్నట్లు కాంగ్రెస్ పార్టీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఖమ్మం ఎంపీ సీటు రేసులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందినితో పాటు ,రెవిన్యూ శాకా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి పోటీ పడుతున్నారు .సోషల్ మీడియా వేదికగా పోటాపోటీగా తమకే ఎంపీ టికెట్ అంటే తమకే వస్తుంది అని ఒకరిని మించి ఒకరు ప్రచారాలు చేసుకుంటున్నారు, భట్టి విక్రమార్క భార్య మల్లు నందిని , పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి . కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరికి రాజ్యసభ ఇవ్వడంతో ముగ్గురి పోటీ కాస్త చివరికి ఈ ఇద్దరి మధ్యే పోటీ నెలకొంది.
అయితే కాంగ్రెస్ పెద్దలు మాత్రం ఖమ్మం సీటు వీరిద్దరిలో ఎవరికి పట్టం కడుతుందనే దానిపై ఉత్కంఠ మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గ ఉంది . సతీమణికి ఎంపీ టికెట్ కోసం భట్టి ,తమ్ముడి కోసం పొంగులేటి హైకమాండ్ తో ఎవరి ప్రయతనాలు వారు చేస్తున్నారు .ఈ ఇద్దరి మంత్రుల కుటుంబంలో ఎవరికో ఒకరి టికెట్ కేటాయించిన కాంగ్రెస్ పార్టీ ఖమ్మంలో చీలుతుందని భావించిన కాంగ్రెస్ పెద్దలు రంగంలోకి రాహుల్ గాంధీని దింపాలని భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది . రాహుల్ గాంధీని ఖమ్మం నుంచి ఎంపీగా గెలిపించి పార్లమెంటుకు పంపించాలని కాంగ్రెస్ పెద్దలు చూస్తున్నట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ పోటీ చేస్తానంటే మేము ఇద్దరమూ పోటీ నుంచి తప్పుకుంటామని ఇద్దరు మంత్రులు ఏఐసీసీ పెద్దలకు చెప్పినట్లు సమాచారం . అయితే ఖమ్మం నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తారా? లేదా? అనేది మరికొన్ని రోజుల్లో కాంగ్రెస్ పెద్దలు ప్రకటించనున్నారు .