కెసిఆర్..యుద్ధమే మిగిలే ఉంది..? సీఎం రేవంత్ “మరో సంచలనం”
ఒకటే జననం…ఒకటే మరణం..
ఒకటే గమనం…ఒకటే గమ్యం..
లోక్ సభలో గెలుపు పొందే వరకు…అలుపు లేదు మనకు
కష్ఠాలు రానీ…కన్నీళ్లు రానీ.. గెలుపు కొరకే ఈ పోరాటం
నిద్రే నీకొద్దు…నింగే నీ హద్దురా…
ఆడబిడ్డల మొఖంలో.. చిరునవ్వులు
అభివృద్ధికి అంకురార్పణలు… నిన్న కొడంగల్ లో మొదలు…
రేపు తెలంగాణ నలుచెరగులా.. కనిపించే దృశ్యాలు.
మీరిచ్చిన అభిమానమనే కుంచెతో …
కొడంగల్ అభివృద్ధి ముఖచిత్రం గీస్తా…
కృష్ణా జలాలతో.. కరువు నేల చరిత్ర తిరగరాస్తా
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పదేళ్ల తర్వాత తాను తెలంగాణకు ముఖ్యమంత్రిగా కొడంగల్ బిడ్డల ఆశీర్వాదంతోనే కాగలిగానని సీఎం రేవంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. కోస్గిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఉద్యమ సమయంలో పాలమూరు ప్రజలు ఆ నాడు వలస వచ్చిన కేసీఆర్ ను ఆదుకున్నారన్నారు. కేసీఆర్ ఎంపీగా గెలిస్తే పాలమూరుకు చుక్కనీరు ఇవ్వలేదని సీఎం రేవంత్‌రెడ్డి గళమెత్తారు. కరీంనగర్ నుంచి గెలవరనే కేసీఆర్ మహబూబ్‌నగర్ నుంచి పోటీ చేశారని తెలిపారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయని మళ్లీ ఓట్ల కోసం కేసీఆర్ వస్తున్నారన్నారు. పాలమూరు ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే కేసీఆర్ ఓటు అడగాలని సీఎం రేవంత్ డిమాండ్ చేశారు. పాలమూరు గడ్డ తనను ఆదరించి, ఆశీర్వదించి, అక్కున చేర్చుకుందని అన్నారు.
పాలమూరు అభివృద్ది జరగాలంటే..
కేంద్రంలో హస్తానికి అధికారం దక్కాల్సిందే
అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
తెలంగాణాలో కాంగ్రెస్ గెలిచినా.. యుద్ధం ముగియలేదన్నారు. ఇది విరామం మాత్రమేనన్నారు. పార్లమెంట్‌లో పట్టు సాధిస్తేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.14 పార్లమెంటు సీట్లు గెలిస్తేనే యుద్ధంలో కాంగ్రెస్ గెలిచినట్లని పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఎత్తుగడలను ప్రజలు తిప్పికొట్టాలని కొడంగల్ నుండి సీఎం రేవంత్ పిలుపునిచ్చారు.ఉమ్మడి ఏపీలో జలదోపిడీ కంటే కేసీఆర్ సీఎం అయ్యాకే ఎక్కువ దోపిడీ జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి కెసిఆర్ పై ద్వజమెత్తారు.

ప్రజలు ‘ఛీ’ కొట్టినా.. BRS నేతలకు సిగ్గురాలే…
పదేళ్లలో వేలాది కోట్ల రూపాయలను కాంట్రాక్టర్లకు అప్పజెప్పిన కేసీఆర్ ఏ ముఖం పెట్టుకొని మళ్లీ ఓట్లు అడిగేందుకు వస్తారని ప్రశ్నించారు.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తానని హామీ ఇచ్చిన ప్రధాని నరేంద్రమోదీ ఎందుకు జాతీయ హోదా ఇవ్వలేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.పాలమూరు అభివృద్ది జరగాలంటే కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీ చంద్ రెడ్డిని ఆశీర్వదించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి.