అధిక శ్రావణ మాసంలో క్రిష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని పరమ ఏకాదశి అంటారు. పరమ ఏకాదశి పవిత్రమైన రోజున ఉపవాస దీక్షను చేపట్టి, శ్రీహరిని పూజించడం వల్ల శుభ ఫలితాలొస్తాయని శాస్త్రం చెబుతోంది . ఏకాదశి శ్రీ మహా విష్ణువుకి అంకితం చేయబడింది. ఈ ఏకాదశి ని కమల ఏకాదశి లేదా పురుషోత్తమ ఏకాదశి అని కూడా అంటారు.
పరమ ఏకాదశి తిథి ప్రారంభం : 11 ఆగస్టు 2023 ఉదయం 7:36 గంటలకు
ఏకాదశి తిథి ముగింపు : 12 ఆగస్టు 2023 ఉదయం 8:30 గంటలకు.. పూజ సమయం 12 ఆగస్టు ఉదయం 7:28 గంటల నుంచి ఉదయం 10:50 గంటల వరకు
పరమ ఏకాదశి వ్రత కథ..
పూర్వకాలంలో సుమేధ అనే బ్రాహ్మణుడు ఉండేవారు. ఆయన భార్య పేరు పవిత్ర. తనకు ఆధ్యాత్మిక రంగంపై ఎక్కువ ఆసక్తి ఉండేది. అయితే వీరు పేదరికం కారణంగా అనే సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఓ రోజు కౌండిన్యఅనే మహర్షి వారి ఇంటికి వెళ్తాడు. వారిద్దరూ తనకు సేవలు చేసినప్పుడు, వారికి పేదరికాన్ని తొలగించడానికి మతపరమైన పరిష్కారం చూపాడు. అధిక శ్రావణంలో క్రిష్ణ పక్షంలో వచ్చే ఏకాదశి రోజున ఉపవాసం ఉండి, రాత్రి మేల్కొని ఉండటం వల్ల విష్ణువు సంతోషిస్తాడని కౌండిన్య మహర్షి చెప్పారు. అనంతరం సుమేధ తన భార్యతో కలిసి ఉపవాస దీక్షను చేశారు. ఈ ఏకాదశి వ్రతం ప్రభావంతో తన దారిద్ర్యం తొలగిపోయి సుఖవంతమైన జీవితం లభించింది.