Saturday, October 5, 2024
spot_img
HomeNewsకాంగ్రెస్ గ్రాఫ్ తెలంగాణ లో కాస్త పెరిగింది ... మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి

కాంగ్రెస్ గ్రాఫ్ తెలంగాణ లో కాస్త పెరిగింది … మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి

తెలంగాణ లో కర్ణాటక ఎన్నికల తదుపరి కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ కొంత పెరిగిన మాట వాస్తవమే అని భారాసా మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీ హరి అన్నారు .

ఓపెన్ హార్ట్ విత్ RK లో కడియం తెలంగాణ లో వివిధ అంశాలపై మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు . తెలంగాణ లో ఇటీవల భాజాపా కుమ్ములాటలు పుణ్యమా అని బలహీనపడిందన్నారు . ఇక తెలంగాణ లో 3 సారి భారాసా అధికారం లోకి రావడం ఖాయమని కడియం అభిప్రాయం వ్యక్తం చేశారు . ఆంధ్ర ప్రదేశ్ లో అధికార పక్షం కుల రాజకీయాలు చేతున్నారన్నారు . జగన్ రెడ్డి అవినీతి పై మాట్లాడుతుంటే నవ్వొస్తుందన్నారు కడియం .

కుమార్తె రాజకీయాల్లోకి రావడం పట్ల ఆసక్తి చూపుతుందన్నారు కడియం . ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయం గా అడిగారని , ఆమె రాజకీయాలు ఇష్టం అని చెప్తే , నా టీం లోకి తీసుకొంటా .. అని కెసిఆర్ అన్నారన్నారు కడియం . కడియం ఇంటర్వ్యూ తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సంచలనాన్ని సృష్టిస్తోంది .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments