బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు , తెలంగాణ ఉద్యమకారుడు ఐన జిట్టా బాలకృష్ణారెడ్డిపై అధిష్ఠానం సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీ నియమ నిబంధనలను ఉల్లంఘించి, క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడినందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్‌రెడ్డి బుధవారం ప్రకటించారు. ఈ సస్పెన్షన్ తక్షణమే అమల్లోకి వస్తుందని, వారం రోజుల్లోపు ఆయన తన ప్రవర్తనపై పార్టీ రాష్ట్ర నాయకత్వానికి వివరణ ఇవ్వాలన్నారు.
నిజానికి జిట్టా బాలకృష్ణా రెడ్డి రాష్ట్ర భాజాపా మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ ను మార్చిన తదుపరి తెలంగాణ భాజపా లో జరుగుతున్న వ్యవహారాల పట్ల తన అసహనాన్న్ని పలు సందర్భాల్లో వ్యక్తం చేసారు . బీజేపీ – భారాసా కలసి పనిచేస్తున్నాయనే అనుమానం వస్తుందనే విధం గా మాట్లాడారు . ఇక కుంభా అనిల్ రెడ్డి భారాసా లో చేరిక జిట్టా కు లైన్ క్లియర్ అయ్యుంది . ప్రముఖ బ్లాగర్ , విశ్లేషకుడు మల్లన్న తో లైవ్ ఇంటర్వ్యూ లో కాంగ్రెస్ తెలంగాణ ను ఇచ్చిన పార్టీ గా తెలంగాణ ఉద్యమకారుడిగా తానూ అభిమానిస్తానన్నారు . బండి సంజయ్ ను తొలగించడం హీనమైన చర్య అని అభివర్ణించారు .
కాగా, తనను సస్పెండ్ చేసి వివరణ ఇవ్వాలన్న బీజేపీ ఆదేశాలపై గురువారం మధ్యాహ్నం 3 గంటలకు అమరుల స్తూపం వద్ద దీనిపై వివరణ ఇస్తానని ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి తెలిపారు.
గత ఏడాదిన్నర క్రితం జిట్టా తానూ స్థాపించిన యువ తెలంగాణ పార్టీని బీజేపీలో విలీనం చేయడం తెలిసిందే . అయితే అప్పటినుంచి ఆయనకు పార్టీపరంగా ఎలాంటి పదవులు లేవు , కాగా జూన్ 13న జిట్టాకు రాష్ట్ర కార్యవర్గసభ్యుడిగా పదవి ఇచ్ఛరు . దీనిపై జిట్టా తనకు సముచిత స్థానం కల్పించలేదని అధిష్ఠానంపై అసహనంతో కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు చేపట్టలేదు . భువనగిరిలో జూన్ 4న పార్టీలతో సంబంధం లేకుండా సొంతం గా అలయ్‌బలయ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి అన్ని పా ర్టీల నేతలతోపాటు ప్రజాసంఘాల నేతలను పిలిచారు . ఈ కార్యక్రమాన్ని చేపట్టడంపై బీజేపీలో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల నల్గొండ రాజకీయాల్లో జరుగుతున్నా మార్పులు చేర్పులు ఆసక్తికరం గా మారాయి . దీనితో జిట్టా కాంగ్రె్‌సలో చేరుతున్నట్లు విస్తృత ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ అధిష్ఠానం ఆయనపై వేటు వేసినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఉద్యమకారుడు జిట్టా సస్పెండ్ తో నల్గొండ జిల్లాలో భాజాపా కు ఇది రాజకీయంగా నష్టాన్నే చేస్తుందని అంచనా !!?
ఇక బండి సంజయ్ కు వ్యతిరేకం గా ఆయన అధ్యక్షుడు గా ఉండగానే తీవ్రమైన ఆరోపణలు చేసిన రఘునందనరావు తదితరులపై కూడా చర్యలుంటాయా అని పలు తెలంగాణా సామాజిక ఉద్యమకారులు ప్రశ్నించడం విశేషం !? రాబోయే రోజుల్లో ఇది ఏ పరిణామాలకు నాంది పలుకుతుందో చూడాల్సిందే !!