Sunday, December 22, 2024
spot_img
HomeNewsAndhra Pradeshమంత్రి పదవి పక్కన పెట్టి రారా.. బట్టలూడదీసి కొడతాం..జోగి రమేష్ పై jana sena

మంత్రి పదవి పక్కన పెట్టి రారా.. బట్టలూడదీసి కొడతాం..జోగి రమేష్ పై jana sena

ఆర్‌ 5 జోన్‌లో ఇళ్ళ నిర్మాణ శంకుస్థాపన సందర్భం గా మంత్రి జోగి రమేష్ అత్యుత్సాహం ప్రదర్శించి , .. ఒకానొకద దశలో సీఎం కూడా అసహనానికి గురయ్యే పరిస్థితికి తీసుకొచ్చారు. ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి రాజకీయ విమర్శలు చేయడమే కాకుండా ప్రతిపక్ష నేతలను ముసలి నక్క , కుక్కలు, పందులు అంటూ చిందులు తొక్కడం విశేషం ప్రధానంగా జనసేనాని , లోకేష్ బాబు , నారా చంద్రబాబు నాయుడు పై చేసిన వ్యాఖ్యలతో జన సైనికులు రాష్ట్ర వ్యాప్తం గా నిరసనలు వ్యక్తం చేశారు .

దీనిపై జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు ఆధ్వర్యంలో పిచ్చి కుక్క జోగి రమేష్ అంటూ జనసేన వీర మహిళలు చెప్పులతో కొట్టారు. జోగి రమేష్ దిష్టి బొమ్మ దగ్ధానికి యత్నించగా… పోలీసులు అడ్డుకున్నారు. వెంటనే దిష్టి బొమ్మను పోలీసులు తీసుకు వెళ్లారు . ఇక అమ్మిశెట్టి వాసును పోలీసులు అరెస్టు చేశారు.

ఈ సందర్భంగా జనసేన కార్యదర్శి అమ్మిశెట్టి వాసు మాట్లాడుతూ.. జోగి రమేష్‌ను పిచ్చి కుక్కను కొట్టినట్లు కొట్టాలన్నారు. ‘‘నువ్వు తార్పితేనే ఎమ్మెల్యే సీటు, మంత్రి పదవి నీకు వచ్చింది. జోగి రమేష్ ఒక బ్రోకర్ గాడు, జోకర్ గాడు. మంత్రి పదవి వచ్చింది బ్రోకర్ పనులు చేసినందుకే. తప్పు అని చెప్పాల్సిన సీఎం కూడా సమర్ధించడం సిగ్గు చేటు. మీ నాయకుడిలా బాబాయిని చంపి అధికారంలోకి మేము రాలేదురా. మా పవన్ కళ్యాణ్ కష్టార్జితాన్ని పేదలకు పంచుతున్నారు. మీ జగన్ ప్రజల సొమ్మును దోచుకుంటున్నాడు.

ప్రభుత్వ సొమ్ములు పంచే సభల్లో మా‌ బూతులు ఏంటి. దమ్ముంటే మంత్రి పదవి పక్కన పెట్టి రారా. విజయవాడ నడి రోడ్ల పై బట్టలూడదీసి నిన్ను కొడతాం. అధికార మధంతో అడ్డగోలుగా వాగుతావా. సీటు రాదనే భయంతోనే కారుకూతలు కూస్తున్నాడు. ఎనిమిది నెలల్లో నువ్వు ఇంటికి పోవడం ఖాయం’’ అంటూ వాసు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ఏది ఏమైనా రాజకీయ నాయకుల భాష ప్రజాస్వామ్య యుతం గా వుండాలని రాజకీయ విశ్లేషకుల , పరిశీలకుల భావన గా వుంది .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments