ఇరు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ కురువృద్ధునిగా పేరు పొందిన కుందూరి జానారెడ్డి ఇక పై ఎన్నికల్లో పోటీ చేయరు . అతి సుదీర్ఘ కాలం కాబినెట్ మంత్రి గా అంటే సుమారు 16 ఏళ్లపాటు పని చేశారు . 6 సంవత్సరాల పాటు నందమూరి తారక రామారావు మంత్రివర్గం లో , 10 సంవత్సరాలపాటు కాంగ్రెస్ప్ర లో వైస్సార్ , రోశయ్య , కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాల్లో పనిచేశారు . 2014 లో కొత్తగా ఏర్పడిన తెలంగాణ శాసన సభలో ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా వున్నారు . 2018 ముందస్తు ఎన్నికలల్లో నోముల నరసింహయ్య పై వోడి పోయారు . గతం లో వున్న చలకుర్తి నియోజకవర్గం నించీ మొదటిసారి 1978 లో జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు . 1983, 1985 లలో తెదేపా అభ్యర్థి గా గెలుపొందారు . 1988 లో తెదేపా ను వీడి 1989, 1999, 2004 లలో కాంగ్రెస్ అభ్యర్థి గా గెలుపు .
నియోజక వర్గాల పునర్విభజన అనంతరం నాగార్జున సాగర్ శాసన సభా స్థానం నుంచీ 2009, 2014 లలో గెలుపొందారు . కుందూరు జానారెడ్డిది సుదీర్ఘ రాజకీయ ప్రయాణం .
పదహారు సంవత్సరాల పాటు మంత్రిగా, ఏడుసార్లు ఎమ్మెల్యేగా సేవలందించిన కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డి రాబోయే 2023 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండనున్నారు. రానున్న సాధారణ ఎన్నికల్లో మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి ఆయన పెద్ద కుమారుడు రఘువీర్‌రెడ్డి, నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి ఆయన చిన్న కుమారుడు జైవీర్‌రెడ్డి పోటీలో ఉంటారని వార్తలు వస్తున్నాయి . జైవీర్ గురువారం పీసీసీ కార్యాలయంలో తన దరఖాస్తు సమర్పించగా రఘువీర్‌రెడ్డి శుక్రవారం తన దరఖాస్తును సమర్పించనున్నారు. ఇక కాంగ్రెస్ అధిష్టానం జానారెడ్డి రాజకీయ వారసత్వం పై ఏ నిర్ణయం తీసుకొంటుందో చూడాలిమరి .