Margadarsi Case: ‘మార్గదర్శి చిట్‌ఫండ్ కేసు బదిలీ కుదరదు’.. అని సుప్రీం కోర్టు ఏపీ ప్రభుత్వానికి స్పష్టం చేసింది . దేనితో జగన్ ఆశలకు చెక్ పెట్టినట్లయుండి . మార్గదర్శి కి సంబంధిచిన కేసులను విచారణా న్యాయపరిధి తెలంగాణ హైకోర్టుకు లేదంటూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సుప్రీమ్పి కోర్ట్టి లో పిటిషన్ష దాఖలు చేయగా , దాన్ని నేడు సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. న్యాయపరిధి అనే విషయాన్ని తెలంగాణ హైకోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టం చేసింది. ఇక ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన బదిలీ పిటిషన్లు కాలం చెల్లినవని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.
మార్గదర్శి మేనేజింగ్ డైరెక్టర్ ఆయన శైలజా కిరణ్‌పై ఎలాంటి కఠిన చర్యలూ తీసుకోవద్దని గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి కూడా సుప్రీంకోర్టు నిరాకరించింది. మెరిట్స్ ఆధారంగా ఈ కేసును విచారించి నిర్ణయం తీసుకోవాలని జస్టిస్ జెకే మహేశ్వరి, జస్టిస్ కెవి విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం తెలిపింది .