Friday, September 13, 2024
spot_img
HomeNewsAndhra PradeshYuvagalam జనగళమే యువగళం పెదకూరపాడు లో ప్రభంజనం లా ..!

Yuvagalam జనగళమే యువగళం పెదకూరపాడు లో ప్రభంజనం లా ..!

పెదకూరపాడు నియోజక వర్గంలో అడుగడుగునా మహళలు హారతులతో నీరాజనాలు పలుకగా యువత కేరింతలతో , రైతులు హర్షాతిరేకం తో , వృద్దుల ఆత్మీయ పలకరింపులతో నారాలోకేష్ పాదయాత్ర ఉత్సాహంగా సాగింది .

భారీ స్వాగత తోరణాలు గజమాలతో గ్రామాల్లోకి ఆహ్వానించారు . 181 రోజు న నిన్న క్రోసూరు ప్రధాన రహదారి జనం తో నిండిపోయుంది . ఇక 182వ రోజు గారపాడు శివారు గంగమ్మతల్లి దేవాలయం నుంచి లోకేష్ బాబు యువగళం పాదయాత్ర ప్రారంభమైంది. లోకేష్ బాబుతో పాదయాత్రలో పాల్గొని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు , కొమ్మాలపాటి శ్రీధర్ లు నడవడం జరిగింది . నారా లోకేష్ బాబు పాదయాత్రలో పలు గ్రామాల ప్రజలు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులు, కష్టాలను విన్నవించారు.

పెదకూరపాడు నియోజకవర్గ ముస్లింలు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. • రాష్ట్రంలో ముస్లింలపై దాడులు జరుగుతున్నాయి. మీ ప్రభుత్వం వచ్చాక అరికట్టాలి. • ఎస్సీల మాదిరిగా ముస్లింలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలి.

Pedakoorapadu Muslims give representation to Nara Lokesh

చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనలకు వస్తే మొరగని వైసీపీ కుక్కా లేదు… ఆయనపై రాళ్ళు వేయని చోటు లేదు. ఈ రెండూ జరగని ఊరూ లేదు. అయినా చంద్రబాబు నాయుడుగారు ఈ సైకో జగన్‌ని చూసి భయపడలేదు. వాటన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకే సాగుతున్నారు. అర్దమైందా రాజా?” lokesh

ఇదిలా ఉండగా pedakoorapadu పోలీసుల పహరా లేకుండా నియోజకవర్గంలో తిరిగే పరిస్థితి లేని వ్యక్తి శంకర్రావు అన్నారు. బెదిరింపులు, పోలీసులతో రాజకీయం చేస్తున్నారని కొమ్మాలపాటి శ్రీధర్ మండిపడ్డారు. ఇక పెదకూరపాడు తెలుగు తమ్ముళ్లు నారా లోకేష్ పాదయాత్ర విజయవంతం కావడం తో జోష్ లో వున్నారు .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments