[ad_1]
ఆంధ్రప్రదేశ్‌లో రోగితో వెళ్తున్న అంబులెన్స్‌లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఒకరికి గాయాలు కాగా రూ. 40 లక్షల విలువైన పొగాకు నిల్వలు దగ్ధమయ్యాయి. ఈ ఘటన ప్రకాశం జిల్లా పామూరు మండలం రాజాసాహెబ్‌పేటలో నిన్న చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పి.ఏసురాజు కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. 108 అంబులెన్స్‌లో డయాలసిస్ నిమిత్తం ఆస్పత్రికి వెళ్తుండగా షార్ట్‌సర్క్యూట్ కారణంగా డ్రైవర్ క్యాబిన్‌లో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన అంబులెన్స్ పైలట్ తిరుపతిరావు వాహనాన్ని ఆపి ఈఎంటీ మధుసూదన్ రెడ్డిని అప్రమత్తం చేశారు.
వెంటనే లోపల ఉన్న రోగిని, ఆమె తల్లిని కిందకు దించారు. వెంటనే అంబులెన్స్‌లోని ఆక్సిజన్ సిలిండర్ పెద్ద శబ్ధంతో పేలిపోయింది. దీంతో వాహన శకలాలు పక్క గ్రామానికి చెందిన రైతు పొలంలో పడిపోయాయి. అక్కడ నిల్వ ఉంచిన సుమారు రూ.40 లక్షల విలువైన పొగాకు స్టాక్‌కు మంటలు అంటుకుని పూర్తిగా దగ్ధమయ్యాయి. సాధినేని వరదయ్యకు వాహన శకలాలు తగలడంతో తీవ్రంగా గాయపడి ఒంగోలు ఆస్పత్రికి తరలించారు.
ప్రకటన
ఈ ఘటన ఆ ప్రాంత ప్రజలను భయాందోళనకు గురి చేసింది. అగ్నిమాపక యంత్రం అక్కడికి చేరుకుంది, అయితే ఆ సమయానికి అంబులెన్స్ మరియు పొగాకు స్టాక్ దగ్ధమైంది. 40 లక్షల నష్టం వాటిల్లిందని షెడ్డులో పొగాకు నిల్వ ఉంచిన ముగ్గురు రైతులు తెలిపారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
[ad_2]