Tuesday, September 17, 2024
spot_img
HomeDevotionalపూజ చేసేప్పుడు తమలపాకులు ఎలా ఉపయోగించాలి ...?

పూజ చేసేప్పుడు తమలపాకులు ఎలా ఉపయోగించాలి …?

హిందూ పూజా విధానం లో తమలపాకులను ఉపయుగించడమనేది అనాది గా వస్తోంది . తమలపాకులు మనం జరుపుకునే ఏ పూజ లో నైనా లేక ఏ శుభకార్యం లో నైనా తమలపాకులు తప్పనిసరి . తమలపాకు ను నాగవల్లి అని పిలుస్తారు . ఆంజనేయుడు నాగవల్లి ప్రియుడు. నాగవల్లి అనగా పాము పడగ వంటి ఆకారము కలిగిన దళములు ఈ తమలపాకులు.

పుట్టుక :

దేవదానవులు క్షీరసాగర మధనం చేసిన సమయంలో కల్పవృక్షం, కామధేనువు, చింతామణి, లక్ష్మీదేవి, కుశలు, కాలకూట విషము, అమృతము ఆపై నాగవల్లి పత్రములు గూడ ఉధ్భవించినది. ఈ తమలపా కులు సేవించటం మన పెద్దలు ఆరోగ్యానికి హేతువు గా భావించేవారు .

జీర్ణశక్తి, ఎముకలపుష్టి, వీర్యవృధ్ధి, ఆకలి కలిగించుట, జఠరాగ్ని రగిలించుట, పైత్యం, అరుచి మొదలైన ఔషధాలన్నీ తమలపాకుల్లో ఉన్నాయని ఆయుర్వేదం చెపుతోంది .

తమలపాకులతో ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ అంటే తమలపాకులతో చేసే పూజ చేస్తే చాలా శుభాలు కలుగుతాయి . ఇలా పూజ చేయాలనుకునే వారు మూలం క్రింద వుండే విధంగా దళపై భాగం ముందునట్లుంచి స్వామి ని పూజించవలెను. ఆంజనేయుని దేహము ఆకుపచ్చరంగులో నుండును – సుందరకాండలో వనములు తిరుగుచూ లంకాపురం చరించునప్పుడు ఇది రక్షణ కవచంగా కాపాడెను. కాబట్టి తమలపాకులతో స్వామిని అర్చిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు చెబుతారు . మరిన్ని విషయాలు తెలుసుకొనాలంటే ఈ క్రింది వీడియొ చూడ గలరు .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments