శ్రావణమాసం మహిళలకు ఎంత ముఖ్యమైనదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శ్రావణ మాసంలో పూజలు, వ్రతాలు అంటూ హిందూ మహిళలు బిజీబిజీగా ఉంటారు. శ్రావణమాసంలో మంగళవారాలకు కూడా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే మహిళలు తమ సౌభాగ్యం కోసం శ్రావణ మంగళగౌరీ వ్రతం చేసుకుంటారు.
శ్రావణ మాసంలో కృష్ణావతారము, హయగ్రీవ అవతారము జరిగాయని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. శ్రావణమాసంలో అన్నిరోజులు పవిత్రమైనవే. ఈ ఏడాది నిజ శ్రావణ మాసం ఆగస్టు 17 గురువారం నుంచి 15 సెప్టెంబరు 2023 శుక్రవారం వరకు ఉంటుంది
శ్రావణ మంగళగౌరీ వ్రతం పెళ్లి అయిన స్త్రీ లు ముఖ్యంగా చేసుకొంటారు . ఇది పెళ్లి ఆయన తర్వాత 5 సంవత్సరాలు చేసుకొంటారు . వివాహమైన మొదటి సంవత్సరం పుట్టింట్లోనూ.. తర్వాత నాలుగు సంవత్సరాలు అత్తవారింట్లోనూ ఈ వ్రతాన్ని చేసుకుంటారు. ఈ వ్రతం చేయడం వల్ల భోగభాగ్యాలే కాకుండా.. దీర్ఘ సుమంగళిగా ఉంటారని భావిస్తారు . పెళ్లి కానీ కన్యలు కూడా పెళ్లి కావడం కోసం తల్లులు సంకల్పము చేసి కన్య ల చేత చేయిస్తారు . ఈ వ్రతం చేయడం వల్ల భోగభాగ్యాలే కాకుండా.. దీర్ఘ సుమంగళిగా ఉంటారని భావిస్తారు
కుజ దోషం వున్న వారు కూడా ఈ శ్రావణ మంగళగౌరీ వ్రతం చేస్తే దోష నివారణ జరుగుతుంది .
ఈ వ్రతానికి ఏమేం కావాలి? మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించడానికి కావలసిన వస్తువులు పసుపు, కుంకుమ, వాయనానికి అవసరమైన వస్తువులు, ఎర్రటి రవికెగుడ్డ, గంధం, పూలు, పండ్లు, ఆకులు, వక్కలు, తోరములకు దారం, కొబ్బరికాయ, పసుపు తాడు, దీపం కుందులు 2, 5 వత్తులతో హారతి ఇవ్వడానికి అవసరమైన హారతి సెమ్మెలు లేదా గోధుమపిండితో గానీ, పూర్ణంతో గానీ చేసిన ఐదు ప్రమిదలు, దీపారాధనకు నెయ్యి, కర్పూరం, అగరుబత్తులు, బియ్యం, కొబ్బరి చిప్ప, శనగలు మొదలైనవి.
ఎలా చేయాలి? 1. వ్రతాన్ని ఆచరించే రోజు ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రం చేసుకుని తలస్నానం చేయాలి. తర్వాత పూజగదిని కూడా శుభ్రం చేసుకోవాలి. 2. ఎర్రటి లేదా ఆకుపచ్చటి వస్త్రాన్ని తీసుకొని పూజ ప్రదేశంలో పరచాలి. 3. బియ్యంతో నవగ్రహాలను తయారుచేయాలి. తర్వాత గోధుమ పిండితో పదహారు మంది అమ్మవార్లను తయారుచేసుకోవాలి. 4. మనం ఎక్కడైతే పూజ నిర్వహిస్తామో(మంగళగౌరీ విగ్రహం ముందు) ఆ మండపానికి ముందు వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించుకోవాలి. 5. మనం అన్ని పూజలకు ఎలాగైతే కలశాన్ని అలంకరిస్తామో ఈ పూజకు అలాగే కలశాలంకరణ చేయాలి. తర్వాత దీపాలు వెలిగించాలి. 6. గౌరీదేవి పూజ ప్రారంభానికి ముందు వినాయకుడి పూజ నిర్వహించాలి. అందుకోసం..పసుపు కుంకుమ, గంధం, తమలపాకులు, అక్షతలు పూలు, పండ్లు మొదలైనవన్నీ ముందుగానే సిద్దం చేసుకోవాలి. 7. ఇలా వరుసగా వినాయకుడికి నవగ్రహాలకు, పదహారు మంది అమ్మవార్లకు పూజ చేసిన తర్వాత మంగళగౌరీ దేవికి షోడశోపచార పూజ నిర్వహించాలి. 8. పదహారు రకాల పూలు, పండ్లు, అద్దం, దువ్వెన, గాజులు..ఇవన్నీ అమ్మకు భక్తితో సమర్పించాలి. అనంతరం వ్రత కథ చదివి వ్రతాన్ని పూర్తి చేయాలి. 9. ప్రసాధం, కుంకుమ, పసుపు.మొదలైనవాటితో ముత్తైదువులకు వాయనాలు ఇవ్వడంతో పూజ ముగుస్తుంది. 10. పూజా విధానం, పూజ సమయంలో పఠించాల్సిన నామాలు, స్త్రోత్రాలు, వ్రత కథ పుస్తకాలు మార్కెట్లో దొరుకుతాయి .
మరింత సమాచారం కోసం గురు వేమూరి కోటేశ్వర శర్మ గారి వీడియో చూడ గలరు.