Fourteen high value open plots at Budwel, of Rajendranagar (M), Rangareddy Dist layout that went under the hammer . In the e-auction highest BID price received was Rs. 41.25 crore per acre. The average bid price per acre was Rs. 36.25 cr.
కోకాపేట భూములు అత్యధిక ధరలు పలకడం తో .. తెలంగాణ HMDA లో కొత్త ఉత్సాహం నింపింది. ఇప్పటికే అభివృద్ధి చేసిన మరిన్ని లే అవుట్ భూముల ఈ- వేలానికి HMDA రంగం సిద్ధం చేసింది . నగర శివారు భూములకు దక్కుతున్న డిమాండ్ తో హెచ్ఎండీఏ.. నేడు బుద్వేల్ లో తన తదుపరి కార్యాచరణ అమలు చేస్తోంది. సుమారు 182 ఎకరాల్లో.. వంద ఎకరాలకు పైగా ఉన్న 14 ప్లాట్లను తొలి విడతలో వేలం నిర్వహిస్తోంది.
బుద్వేలులో భూములు ఔటర్ రింగ్ రోడ్డుకు దగ్గరగా అంటే ఎయిర్ పోర్టుకు 20 నిమిషాల్లోపు చేరుకునే అవకాశం ఉండటంతో.. బుద్వేల్ భూములకు రికార్డు ధర పలకవచ్చని రియల్ ఎస్టేట్ వర్గాల్లో అంచనా . ఇక బుద్వేల్ భూముల వేలంపై స్టే కోసం హైదరాబాద్ బార్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్ పై స్టే ఇవ్వడానికి తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది.
ఎకరం భూమికి రూ. 20 కోట్లుగా HMDA నిర్ణయించింది. బుద్వేల్ భూములను దక్కించుకొనేందుకు పలు బడా Real State కంపెనీలు e-auction lo పాల్గొనేందుకు ఆసక్తిని చూపుతున్నాయి.