Sunday, December 22, 2024
spot_img
HomeNewsAndhra PradeshMargadarsi Chifunds : మార్గదర్శిపై దాడులు ఆపేయాలి ... ఏపీ హైకోర్టు..ఎప్పటివరకు అంటే?

Margadarsi Chifunds : మార్గదర్శిపై దాడులు ఆపేయాలి … ఏపీ హైకోర్టు..ఎప్పటివరకు అంటే?

మార్గదర్శి సంస్థలపై పగబట్టినట్లుగా ఆంధ్ర ప్రభుత్వం చేస్తున్న దాడులను ఆపేయాలని ఏపీ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎటువంటి దాడులు చేయవద్దని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. మార్గదర్శి సంస్థలపై పలు ప్రభుత్వ శాఖలు నాలుగు రోజుల పాటు సోదాలు నిర్వహించాయి. ఖాతాదారులను, ఏజెంట్లను బెదిరించి మరీ తప్పుడు ఫిర్యాదులు తీసుకుంటున్నట్లుగా ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే . ఈ క్రమంలో మార్గదర్శి పై వివిధ ప్రభుత్వ శాఖల దాడులు చేయడాన్ని యాజమాన్యం హైకోర్టులో సవాల్ చేయగా , ఈరోజు హైకోర్టులో విచారణకు రాగా.. మార్గదర్శి తరపున సీనియర్ న్యాయవాదులు నాగముత్తు, మీనాక్షి అరోరా తమ వాదనలు వినిపించారు. వాదనల అనంతరం మధ్యంతర ఉత్తర్వుల కోసం హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఉత్తర్వులు ఇచ్చే వరకు మార్గదర్శి సంస్థలపై ఎటువంటి దాడులు చేయవద్దని ప్రభుత్వ న్యాయవాదులకు హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది.

గత నాలుగు రోజులుగా రేయింబవళ్లు మార్గదర్శి లో సోదాలు చేశారు. నిజానికి మార్గదర్శి ఆఫీసుల్లో గతంలోనే సోదాలు చేశారు. గత కొద్ది రోజులుగా మార్గదర్శిపై తమదైన శైలిలో ప్రభుత్వం వ్యవహరిస్తోంది. మార్గదర్శిని మూసేస్తామని హెచ్చరించి.. దాని కోసం చేయాల్సినవన్నీ చేస్తోంది. ఇప్పుడు హైకోర్టు ఆదేశంతో ఇక దాడులు.. ఎలాంటి చర్యలు తీసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments