HYDERABAD: సోమవారం ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కుండపోత కురిసింది. ఇక హైదరాబాద్ లో కుండపోతగా వర్షం కురుస్తోంది . తెరిపి లేకుండా కురుస్తున్న వర్షం తో లోతట్టు కాలనీ లు అన్నీ జలమయమయ్యాయి . ఈ వర్షం తెలంగాణా వ్యాప్తంగా మరి రెండు రోజుల పాటు వుండే అవకాశం వుంది .
గోదావరి ప్రాజెక్టులకు వరద..ఉదృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 50వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరడంతో.. 16 గేట్లు ఎత్తి వరదను విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులకు గాను ప్రస్తుతం 1090 అడుగుల మేర నీటి నిల్వ ఉంది. కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 35 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు 17,169 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా.. రెండు గేట్లు ఎత్తి 28,925 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 43,538 క్యూసెక్కుల వరద వస్తుండగా, 43,120 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. మెదక్ జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుకు 8,150 క్యూసెక్కుల వరద వస్తోంది.