తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు పాత గుడివాడ తాలూకా నిమ్మకూరు . ఇక్కడ నుండే ఆయన ఎమ్మెల్యేగా గెలుపొంది చరిత్ర సృష్టించారు. ప్రస్తుతం నిమ్మకూరు 2009 నియోజక వర్గ పునర్ఆ విభజన అనంతరం పామర్రు మండలం పరిధిలోకి వచ్చి , పామర్రు Reserved పరిధిలోకి వచ్చింది . ఈ స్థానం తెదేపా కు కంచుకోట అయినా , ప్రస్తుత MLA కొడాలి నాని 2004, 2009 లో టిడిపి అభ్యర్థిగా గెలపొందగా , అధినేత చంద్రబాబు తో విభేదించి 2014, 2019 లలో వైసీపీ నుంచి విజయం సాధించారు. ఈ నియోజక వర్గాన్ని కోడలి నాని తన కంచుకోట గా మలచుకొన్నారనే చెప్పాలి . రానున్న 2024 ఎన్నికల్లో కూడా వైసీపీ నుంచే కొడాలి నాని బరిలో దిగడం ఖాయం. వైకాపా లో కొంత కాలం మంత్రి గా కూడా నాని పనిచేసి తెదేపా అగ్ర నాయకులపై ముఖ్యంగా చంద్రబాబు కుటుంబం పై తీవ్ర వ్యకిగత వ్యాఖ్యలు చేస్తూ తరచూ వార్తలకెక్కుతున్నారు . 1999లో టిడిపి తరఫున రావి వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేగా గెలుపొందారు. రావి కుటంబం గతం లో 1985, 1994, 1999 లలో MLA గా గెలిచారు . సాత్విక స్వభావం కలిగిన ఈ కుటుంబానికి కొంత పేరు ప్రతిష్టలు విచక్షణ కలిగిన ఓటర్లలో వుంది . ప్రస్తుతం రావి వెంకటేశ్వరరావు గుడివాడ నియోజకవర్గం టిడిపి ఇన్చార్జిగా ఉన్నారు. 2004 లో కోడలి నాని కి టీడీపీ టికెట్ ఇవ్వడం జరిగింది. అప్పటినుంచీ 20 ఏళ్లుగా నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా, మంత్రి గా పనిచేసిన కొడాలి నానిని ఓడించాలని దృఢ సంకల్పంతో టిడిపి అధినేత చంద్రబాబు ఈ నియోజకవర్గం పై ప్రత్యేక దృష్టి ని సారించారు . ఒకసారి గుడివాడ శాసనసభ భౌగోళిక రాజకీయ స్వరూపాన్ని పరిశీలిద్దాము .
గుడివాడ అసెంబ్లీ ఉమ్మడి కృష్ణా జిల్లా లో మచిలీపట్టణం లోక సభా పరిధిలోని నియోజక వర్గం . ఈ అసెంబ్లీ పరిధిలో గుడివాడ (రురల్) , గుడ్లవల్లేరు , నందివాడ మండలాలు గుడివాడ మున్సిపాలిటీ పంతాలు వున్నాయి . బీసీ ఓటర్లు 90 వేల పైచిలుకు ఉండగా , 30 వేలు కాపు సామాజిక వర్గానికి , 14 వేలు కమ్మ సామాజిక వర్గం , సుమారు 48 వేల SC / ST ఓటర్లు వున్నారు . మొత్తం ఓటర్లు సుమారు 210,000. ఇక గుడివాడ మున్సిపాలిటీ కావడం తో ఇక్కడ పట్టణ ఓటర్లు సుమారు 95 వేల పైచిలుకు వున్నారు . 2019 శాసనసభా ఎన్నికల్లో ఇక్కడ నాని తెదేపా కు చెందిన దేవినేని అవినాష్ పై సుమారు 19 వేలకు పైగా ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు .
ఇక్కడ ఆసక్తికరమైన అంశం , 2019 లోకసభ ఎన్నికల్లో ఈ అసెంబ్లీ సెగ్మెంట్ లో తెదేపా ఆధిక్యం లో వుంది . అంటే ఇక్కడ క్రాస్ వోటింగ్ భారీ గా జరిగింది .
ఈసారి ఇక్కడ జనసేన , వంగవీటి రాధాకృష్ణ ప్రభావం ఈ నియోజకవర్గం పై వుండే అవకాశం స్పష్టం గా వుంది . ఇక తెదేపా అధినేత అత్యంత ప్రతిష్టాత్మకం గా ఈ నియోజకవర్గాన్ని తీసుకొని NRI వెనిగండ్ల రాము ను రంగం లోకి దించారు . ఆయన తన ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రతి గ్రామంలోకి చొచ్చుకొని వెళ్లారు . సుమారు 48 వేల దళిత ఓట్లు కు వెనిగండ్ల రాము భార్య ద్వారా తీవ్ర గండి పడే అవకాశం హెచ్చుగా వుంది . ఆమె దళిత సామజిక వర్గానికి చెందినది కావడం తో వె, ఆర్ధికం గా నాని తో ఢీ అంటే ఢీ అనే స్థితిలో ఉండడం విశేషం . ఇప్పటిదాకా కొడాలి నానీ కి వెన్ను దన్ను గా వున్నా కమ్మ , కాపు సామాజిక వర్గాలు దూరంగా జరగడం , దళిత వోటుబ్యాంక్ లో చీలిక , బీసీలు ఈసారి తెదేపా కు మరింత ఎక్కువగా పోలరైజ్ కావడం వంటివి రాబోయే ఎన్నికల్లో కొడాలి నాని కి 2024 లో చెక్ పెట్టే అంశాలుగా చెప్పవచ్చు …ఈసారి గుడివాడలో పకోడీ రాజకీయాలకు జనసేన చెక్ పెట్టడం మీరే చూస్తారు ..