అసెంబ్లీ సాక్షిగా బారాసాకు వాతలు పెట్టిన గవర్నర్
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కాళోజీ కవితతో గవర్నర్ తమిళిసై తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి.
నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం దిశ నిర్దేశంపై గవర్నర్ తమిళశై స్పీచ్ ఇచ్చారు
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ అధినేత గులాబీ దళపతి 10 ఏళ్ళ పరిపాలనపై గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు చేశారు.ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే కంచెను తొలగించి . ప్రజాభవన్ లోకి స్వేచ్ఛగా వచ్చి ఫిర్యాదులు ఇచ్చేందుకు ప్రజలకు అనుమతి లభించిందన్నారు. రాష్ట్ర ప్రజలు ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేశారన్నారని .
ఎన్నికల సమయంలో మేము ఇచ్చిన 6 గ్యారంటీలను సకాలంలో అమలు చేస్తామని .ఈ ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందన్నారు .
రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మర్చి ,ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి మాకు అప్పగించారని బీఆర్ఎస్‌కు చురకలు అంటించారు.
రాష్ట్రాన్ని పునర్నిమించే భాగంలో శ్రమిస్తున్నాం .ఆరు గ్యారంటీల్లో రెండు గ్యారంటీలను అమలు చేశామని త్వరలో మరో రెండు గ్యారంటీలను అమలు చేస్తాం అని అన్నారు .
ప్రస్తుతం తెలంగాణలో ప్రజల కొరకు, ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం నడుస్తుంది.మహాలక్ష్మీ పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టాము అన్నారు .
ఇందులో భాగంగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణలో ఇంటర్నెట్ అందరికీ అందుబాటులో ఉండటం తప్పనిసరి అని త్వరలో ప్రతి ఇంటికి ప్రభుత్వమే ఇంటర్నెట్ అందిస్తుంది అని గవర్నర్ తమిళిసై తెలిపారు.
తెలంగాణ ఇచ్చిన మన్మోహన్ సర్కారుకు తెలంగాణ కొత్త ప్రభుత్వం కృతజ్ఞతలు తెలియజేస్తున్నది . ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సోనియా గాంధీ పోషించిన కిలక పాత్రను ప్రభుత్వం గుర్తుచేసుకుంటున్నదని అన్నారు .
టీఎస్పీఎస్సీ ద్వారా 2 లక్షల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం రెడీగా ఉందన్నారు. ధరణి కమిటీ ద్వారా భూ సమస్యలు పరిష్కరిస్తాము .
మా ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ, పారదర్శకత పాటిస్తుందని బీఆర్ఎస్‌కు చురకలు అంటించారు. గత ప్రభుత్వ నిర్వాకాలను శ్వేతపత్రం ద్వారా ప్రజలకు తెలియజేశామన్నారు.
దావోస్ లో జరిగిన సమావేశాలలో రూ.40 వేల కోట్ల మేర పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయని తెలిపారు .
యంతో ఆతృతగా ఎదురు చూస్తున BRS నాయకులకు నిరాశేమిగిలింది తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం గులాబీ దళపతి కెసిఆర్ హాజరు కావడంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
కానీ కేసీఆర్ నేడు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేదు . బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజే కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు అవుతారు అన్నట్లు తెలిసింది.
అసలు విషయం ఏమిటంటే సీఎం రేవంత్ తోనూ , రాష్ట్ర గవర్నర్ తమిళశై తోను గతంలో మాజీ సీఎం
కేసీఆర్కు మంచి సంబంధాలు లేవు.
అసెంబ్లీ సమావేశాల్లో వారి ముఖం చూడడానికి ఇష్టం లేనందునే గులాబీ దళపతికెసిఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారనే మాటలు రాజకీయ విశ్లేషకులలో వినిపిస్తున్నాయి.