Sunday, December 22, 2024
spot_img
HomeEditorialనేటి జగతి వేగుచుక్క "సీతక్క"

నేటి జగతి వేగుచుక్క “సీతక్క”

ప్రశాంత కొండ కోనల్లో ప్రగతి కరువైన చోట జగతి వేగుచుక్క అల్లూరి సీతారామరాజు…ఇది నాడు

ప్రశాంత కొండ కోనల్లో ప్రగతి కరువైన చోట జగతి వేగుచుక్క మన అమ్మ సీతక్క …. ఇది నేడు

వాహిని వారి పెద్ద మనుషులు

1954 లో విడుదల ఆయన ఈ చిత్రం ఆనాటి సంఘం లో పెద్దమనుషులు గా చలామణి అవుతున్న వ్యక్తులు తెరవెనుక చేసే అన్యాయాలు , అకృత్యాలు, అవినీతి లపై తీసిన వ్యంగ్య విమర్శ నాత్మక చిత్రం . అప్పటికి ఇప్పటికి నాయకుల ప్రవర్తలో ఎలాంటి మార్పు లేదనేది నిజం . 

సీతక్క వేగుచుక్క , ధనసరి అనసూయ అలియాస్ సీతక్క.. భూమిపుత్రులు..గిరిపుత్రులు..!మైదానప్రాంతాలకు దూరంగా..! అంతా సవ్యంగా ఉన్నపుడే..అంతంత మాత్రం సంక్షేమం..సౌకర్యం ..పధకాల లబ్ది ఉంటుంది. అభివృద్ధి చెందిన నాగరిక సమాజము..అర్బన్ పాప్యులేషన్ మాత్రమే ప్రజలు అనుకునే ప్రచారసాధనాలూ…పాలకులు..! అడవి బిడ్డల ఆశాదీపం..వారి మధ్య వెలిగిన దీపం..! అడవిచుక్క..వేగుచుక్క..సీతక్క

ఎండా ..వానా..!వాగు ..వంకా..!రహదారా..కాలిబాటా…!కొండలు..గుట్టలు..అన్నిటినీ అధికమిస్తుంది…! ఉపాధి కరువైన వేళ..ఆకలి మంటలు చల్లార్చే యంత్రం లా  కదిలింది బాధ్యతగా..కరోనా వేళ! ఆకలి దప్పులు మరచి..కాలాన్ని విస్మరించి..బిడ్డల ఆకలి తీర్చే అన్నపూర్ణలా మారింది. నువ్వు సమ్మక్కవి..సారక్కవి..వనదేవత వి.. నిన్ను ఎంచుకోవటంలో ప్రజల పరిణితి ని అభినందించక తప్పదు. దేవుడు నీకు మరింత శక్తిని సామర్ద్యాన్ని ఇవ్వాలని ప్రార్దన. (#అడుసుమిల్లి

ఒక్క‌సారి ఎమ్మెల్యేగా గెలిస్తే చాలు.. జ‌నాన్ని ప‌ట్టించుకోని నాయ‌కుల‌ను ఎందరినో మనం చూస్తున్నాం .  జ‌నం భారీ  వర్షాలతో పలు  బాధ‌ల్లో ఉంటే ఈ  నాయ‌కులు ఆలా వచ్చి ఇలా వెళ్ళిపోతారు .  కానీ జ‌నం బాధ‌ను త‌న బాధ‌గా, ప్ర‌జ‌ల దుఖాన్ని త‌న క‌న్నీటిగా భావించే అరుదైన నాయకుల్లో మన సీతక్క ఒకరు .  నా జ‌నం వెంటే నేను అని ఎమ్మెల్యే సీత‌క్క మ‌రోసారి నిరూపించారు. ఇటీవ‌లి భారీ వ‌ర్షాలకు ములుగు ప్రాంతం భారీగా నష్టపోయుంది . అంతటా  వ‌ర‌ద‌లే.. క‌న్నీళ్లతోపాటు  క‌ట్టుబ‌ట్ట‌లు మిగిలాయి . ప్రాణాల కోసం పరుగులు .. ఇంకా  వ‌ర‌ద నీటిలో చిక్కుకుపోయిన వారు కూడా ఉన్నారు. 

తన  జ‌నం వ‌ర‌ద‌లో కొట్టుక‌పోయారు.. హెలికాప్ట‌ర్ కావాలి అని ఉద‌యం నుండి సీఎంకు, కేటీఆర్ కు, మంత్రుల‌కు ఫోన్ చేసినా.. కండ్ల ముందే కావాల్సిన వారు కొట్టుక‌పోతుంటే.. అంటూ ములుగు  ఎమ్మెల్యే సీత‌క్క క‌న్నీరు మున్నీరయ్యారు. నిజానికి కొట్టుక‌పోయిన వారు సీత‌క్క కుటుంబీకులు కాదు. చుట్టాలు అంత‌క‌న్నా కాదు. త‌న నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల  కోసం సీత‌క్క ఎంత త‌ప‌న ప‌డ్డారో ఇది ఒక  ఉదాహ‌ర‌ణ.. 

అంతేకాదు మ‌హిళ‌గా కొట్టుక‌పోయిన బ్రిడ్జిలు దాటుతూ, కాలినడ‌క‌న వెళ్తూ, మోకాలి లోతు నీళ్ల‌లోనూ జ‌నాన్ని ఓదార్చుతూ ఎమ్మెల్యే సీత‌క్క ప‌డ్డ క‌ష్టం అంతా ఇంతా కాదు. స‌ర్వం కోల్పోయిన జ‌నానికి ధైర్యం చెప్తూ, తోచిన స‌హాయం చేస్తూ.. అధికారుల‌తో మాట్లాడుతూ ఎమ్మెల్యే సీత‌క్క బాధిత ములుగు ప్ర‌జ‌ల‌కు ఆమె అమ్మ‌గా మారింది .  ఇది సోష‌ల్ మీడియాలో సీత‌క్క త‌ప‌న బాగా వైర‌ల్ కావడం తో  రాజ‌కీయాల‌కు అతీతంగా సీత‌క్క‌ను ఇష్ట‌ప‌డే వాళ్లు ఉన్న‌ప్ప‌టికీ, తిట్టేందుకు రెడీగా ఉండే పెయిడ్ ఆర్టిస్టులుగా కూడా ఉంటారుగా.

అందుకే ఎమ్మెల్యే సీత‌క్క వీడియోల‌కు కౌంట‌ర్ గా తాను ఇటీవ‌ల అమెరికా వెళ్లిన విమానం ఫోటోలు పెడుతూ.. సీత‌క్క పేద‌రికంలోనే ఉంటే స్పెష‌ల్ జెట్ ఎక్క‌డిది? అంటూ ప్ర‌శ్నించారు. దీనిపై ఫ్యాక్ట్ చెక్ చేయ‌గా.. అది స్పెష‌ల్ జెట్ కాద‌ని, బిజినెస్ సీట్ అని తేలింది. కాస్త భార‌మైన త‌న ఆరోగ్య ప‌రిస్థితుల దృష్ట్యా 18గంట‌ల‌కు పైగా ప్రయాణం కాబ‌ట్టి ప్ర‌యాణించాల్సి వ‌చ్చింద‌ని తేలింది. అంతేకాదు నిజానికి ఎమ్మెల్యే సీత‌క్క‌కు ఇది ఫ‌స్ట్ ఇంట‌ర్నేష‌న‌ల్ ప్ర‌యాణం . అంటే గిరి పుత్రి ఫ్లైట్ ఎక్కకూడదు . అవి దొరలకు , వారి తాబేదార్ల మాత్రమేనా … 

ఒక్కసారి హృదయం తో అలోచించండి , ఆకాశం వైపు తిరిగి ఉమ్ము వేయొద్దు , అది మీ మొహం మీదే పడుతుంది .. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments