Sunday, December 22, 2024
spot_img
HomeNewsAndhra Pradesh"వంగవీటి" వారి ఇంట పెళ్లి సందడి ..!?

“వంగవీటి” వారి ఇంట పెళ్లి సందడి ..!?

ఈ శ్రావణ మాసం వంగవీటి రాధాకృష్ణ కు శుభాన్ని తెచ్చింది . కీ . శే వంగవీటి మోహన రంగ మరియు రత్న కుమారి ల తనయుడు వంగవీటి రాధాకృష్ణ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. నర్సాపురం అల్లుడు కాబోతున్నారు. నరసాపురానికి చెందిన జక్కం బాబ్జి , అమ్మాణి దంపతుల చిన్న కుమార్తె పుష్పవల్లి తో వంగవీటి రాధా వివాహం ఖరారైనట్లు సమాచారం . పుష్పవల్లి తల్లి జక్కం అమ్మాని నరసాపురం మున్సిపాలిటీ టిడిపి చైర్ పర్సన్‌గా 1987-92 వరకు బాధ్యతలు నిర్వహించారు. వధువ తండ్రి టీడీపీ లో సుదీర్ఘ కాలం కీలకమైన నేత. మధ్యలో రాజకీయాలకు బ్రేక్ ఇచ్చి వారు హైదరాబాద్‌లో స్థిరపడి , ఇప్పుడు నర్సాపురంలోనే ఉన్నారు. కొంత కాలం క్రితం వారు జనసేనలో చేరారు. రాజకీయంగా తిరిగి యాక్టివ్ అయ్యారు.

గత నెలలో పవన్ కల్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల్లొ వారాహి యాత్ర సమయంలో నర్సాపురంలో ఉన్న సమయంలో వీరి ఇంటిలోనే బస చేశారని తెలుస్తోంది. ఆ సమయంలో తమ కుమార్తె వివాహం విషయం కూడా ప్రస్తావనకు వచ్చినట్లు వినికిడి. నర్సాపురంలో జరిగిన రంగా జయంతి వేడుకల్లో పాల్గొన్న రాధాకృష్ణ వీరి ఇంటికి వచ్చారు. ఆ సమయంలో రెండు వైపులా వివాహ సంబంధం గురించి ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. నర్సాపురానికి చెందిన జనసేన ఇన్‌ఛార్జ్ నాయకర్, మాజీమంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు సైతం వంగవీటి రాధా ఈ వివాహ ఖరారు సమయంలో పెళ్లి పెద్దలు గా వ్యవహరించినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 6 తేదీన సింపుల్‌గా పెళ్లి వేడుకను నిర్వహించే అవకాశం ఉందని మిత్రులు శ్రేయోభిలాషుల సమాచారం .

Celebrity Marraige:

MLA 2004 – 2009 Vizayawada EAST

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments