Saturday, September 7, 2024
spot_img
HomeCinemaమెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు

మెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు

చిరంజీవి గారు వారి అసలుపేరు కొణిదెల శివ శంకర వరపరసాద్ తెలుగు చలన చిత్ర నటుడు, రాజకీయ నాయకుడు, మెగాస్టార్‌గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. కేంద్ర ప్రభుత్వంలో 27-08-2012 నుంచి 26-05-2014 దాకా పర్యాటక శాఖా మంత్రి గా పనిచేశారు, బ్రేక్ డ్యాన్స్ కు పేరు పొందిన చిరంజీవి 150కి పైగా చిత్రాల్లో నటించారు నటిస్తున్నారు . తెలుగు చిత్రాలు ఏ కాకుండా తమిళ, కన్నడ, హిందీ చిత్రాలు చేసారు అత్యధికముగా తెలుగు చిత్రాలు చేసారు .40 ఏళ్ళకు వారి నట ప్రస్థానంలో మూడు సార్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది అవార్డు పురస్కారాలు, రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు , తొమ్మిది ఫిల్మ్ ఫేర్ అవార్డులు గెలుచుకున్నారు . 2006వ సంవత్త్సరంలో చిరంజీవి గారికి చలన చిత్ర రంగంలో చేసిన సేవలకు గాను పద్మభూషణ్ అవార్డు వరించింది . ఈ సంవత్సరంలోనే ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు ఇచ్చి సత్కరించారు.

1978సంవత్సరంలో లో వచ్చిన పునాదిరాళ్ళు చిత్రంతో చిరంజీవి గారి నటనా జీవితం ప్రారంభమైంది. కానీ అంతకుముందే ప్రాణం ఖరీదు చిత్రం విడుదలైంది. 1987 సంవత్సరంలో చిరంజీవి గారు నటించిన స్వయంకృషి చిత్రం రష్యన్ భాషలోకి అనువాదమై మాస్కో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శింపబడింది.ఈ చిత్రానికి గాను చిరంజీవి గారికి 1988 సంవత్త్సరంలో ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఉత్తమ నటుడిగా మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది అవార్డు అందుకున్నారు .ఇదే సంవత్సరంలో 59 వ అకాడమీ అవార్డుల ప్రధానోత్సవానికి భారతదేశ చలన చిత్రరంగ ప్రముఖుల్లో ఒకరిగా వెళ్ళారు. 1988 సంవత్త్సరంలో చిరంజీవి గారు కో ప్రొడ్యూసర్ గాను వ్యవహరించి వారు హీరోగా నటించిన రుద్రవీణ చిత్రం ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు అందుకుంది.

1992 సంవత్త్సరంలో కె. రాఘవేంద్రరావు గారు దర్శకత్వంలో చిరంజీవి గారు నటించిన ఘరానా మొగుడు చిత్రం 10 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించిన తొలి తెలుగు చిత్రంగా నిలిచింది. ఘరానా మొగుడు చిత్రం 1993 సంవత్త్సరంలో జరిగిన భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో మెయిన్ స్ట్రీం విభాగంలో ప్రదర్శించారు .ఈ ఘరానా మొగుడు సినిమాతో చిరంజీవి గారు భారతదేశంలో అత్యధిక పారితోషికం అందుకున్న నటుడిగా భారతదేశ వారపత్రికల ముఖచిత్రంపై కనువిందు చేసారు . ఫిల్మ్ ఫేర్, ఇండియా టుడే పత్రికలు చిరంజీవి గారిని బాలీవుడ్ దిగ్గజం అమితాబచ్చన్ తో పోలుస్తూ అనేక శీర్షికలు వెలువరించాయి. ది వీక్ పత్రిక చిరంజీవి గారిని ది న్యూ మనీ మెషీన్ అని అభివర్ణించింది.

1992 సంవత్త్సరంలో వచ్చిన ఆపద్బాంధవుడు చిత్రానికి గాను 1.25 కోట్ల రూపాయల పారితోషికం అందుకున్నారు చిరంజీవి గారు . అప్పటికి అది భారతదేశంలోనే ఏ నటుడూ తీసుకోనంత ,పారితోషికం. 2002 సంవత్సారంలో భారతదేశ కేంద్రప్రభుత్వ ఆర్థిక శాఖ 1999-2000 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక ఆదాయ పన్ను చెల్లింపుదారుగా సమ్మాన్ పురస్కారాన్నిచిరంజీవి గారికి ప్రకటించింది. 2006 లో సి.ఎన్.ఎన్. ఐబిఎన్ నిర్వహించిన సర్వేలో తెలుగు చిత్రపరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటుడిగా గుర్తించింది.అత్యంత ప్రజాధారణ కలిగిన చిరంజీవి గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుందాం

1st Publish Date 22-08-2023

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments