భారత దేశంలో ప్రధానంగా నాలుగు కేటగిరీలలో యూనివర్సిటీలుంటాయి. మనకి 1956లో వచ్చిన యూజీసీ (UGC ) చట్టం ప్రకారం.. ఎవరైనా యూనివర్సిటీ ఏర్పాటు కావాలంటే యూజీసీ గుర్తింపు కచ్చితంగా ఉండాలి. ప్రస్తుతం దేశంలో యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీలు మొత్తం 1102 ఉన్నాయి.
అందులో..
సెంట్రల్ Central యూనివర్సిటీలు – 56
స్టేట్ STATE యూనివర్సిటీలు – 474
డీమ్డ్ (Deemed )యూనివర్సిటీలు – 125
స్టేట్ ప్రైవేటు (Private ) యూనివర్సిటీలు – 447
ఇవి కాకుండా ఎలాంటి గుర్తింపు, అనుమతి లేకుండా దేశంలో యూనివర్సిటీలు పుట్టుకొస్తున్నాయి. చిన్న భవనాన్ని అద్దెకు తీసుకుని యూనివర్సిటీని ఏర్పాటు చేస్తారు . వెబ్ సైట్ లోనే వ్యాపారం .
యూజీసీ ఇచ్చిన ఫేక్ యూనివర్సిటీల జాబితాhttps://www.ugc.gov.in/page/Fake-Universities.aspx
- క్రైస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ(గుంటూరు, ఆంధ్రప్రదేశ్)
- బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా(ఆంధ్రప్రదేశ్)
- ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అండ్ ఫిజికల్ హెల్త్ సైన్సెస్(దిల్లీ)
- కమర్షియల్ యూనివర్సిటీ(దిల్లీ)
- యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ(దిల్లీ)
- వొకేషనల్ యూనివర్సిటీ(దిల్లీ)
- ఏడీఆర్-సెంట్రిక్ జ్యురిడికల్ యూనివర్సిటీ(న్యూదిల్లీ)
- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్(న్యూదిల్లీ)
- విశ్వకర్మ ఓపెన్ యూనివర్సిటీ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్(దిల్లీ)
- ఆధ్యాత్మిక్ విశ్వవిద్యాలయ(స్పిరిట్యువల్ యూనివర్సిటీ)(దిల్లీ)
- బడగాన్వి సర్కార్ వరల్డ్ ఓపెన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ సొసైటీ(కర్ణాటక)
- సెయింట్ జాన్స్ యూనివర్సిటీ(కేరళ)
- రాజా అరబిక్ యూనివర్సిటీ(మహారాష్ట్ర)
- శ్రీ బోధి అకాడమీ ఆప్ హైయ్యర్ ఎడ్యుకేషన్(పుదుచ్చేరి)
- గాంధీ హిందీ విద్యాపీఠ్(అలహాబాద్, యూపీ)
- నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎలక్ట్రో కాంప్లెక్స్ హోమియోపతి(కాన్పుర్, యూపీ)
- నేతాజీ సుభాష్ చంద్రబోస్ యూనివర్సిటీ(అలీఘడ్, యూపీ)
- భారతీయ శిక్షా పరిషద్(లఖ్ నవూ, యూపీ)
- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్(కోల్‌కతా)
- ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అల్టర్నేటివ్ మెడిసిన్ అండ్ రీసర్చ్(కోల్‌కతా)