Saturday, December 21, 2024
spot_img
HomeNewsEx. Minister A ChandraSekhar Good Bye to BJP...

Ex. Minister A ChandraSekhar Good Bye to BJP…

తెలంగాణ‌లో బీజేపీకి ఇబ్బందులు తప్పేలా లేవు . ఒక mla అభ్యర్థి ని పార్టీలో చేర్చుకొంటే ఇద్దరు బయటకు పోతున్నారు . ఎన్నికలు సమీపిస్తున్న వేళ , బండి సంజయ్ ను తప్పించి భాజాపా కేంద్ర నాయకత్వం సాహసమే చేసిందని చెప్పాలి . తెలంగాణా భాజాపా లో రాజీనామా ల పర్వం కొనసాగుతోంది . ఆ పార్టీకి సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి చంద్ర‌శేఖ‌ర్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖ‌ను ఏకంగా బీజేపీ అధ్య‌క్షుడు కిష‌న్‌రెడ్డికి పంపారు. గత కొంత కాలం గా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు . భాజాపా ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ గతం లో చంద్ర శేఖర్ ను కలసి బుజ్జగించినా ప్రయోజనం లేకపోయుంది . మ‌రోవైపు బీఆర్ఎస్‌, బీజేపీ అసంతృప్త నేతలు కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూప‌డం ఆస‌క్తిక‌ర ప‌రిణామంగా మారింది .

Chandrasekar A resignation letter

మాజీ మంత్రి చంద్ర‌శేఖ‌ర్ దళిత నేత మాత్రమే కాదు , ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా పని చేసారు. వికారాబాద్ కేంద్రం గా గత మూడు దశాబ్దాలుగా రాజాకీయాల్లో వున్నా వ్యక్తి. 1985, 1989, 1994,1999 ల లో వరుసగా నాలుగు సార్లు టీడీపీ MLA గ గెలిచారు . 2004 లో తెరాసా అభ్యర్థి గా MLA గా గెలిచారు . 2019 లోకసభ స్థానం లో కాంగ్రెస్ అభ్యర్థి గా పోటీ చేసి వోడి పోయారు .

చంద్రశేఖర్ కు రంగారెడ్డి జిల్లా లో గణనీయమైన సంఖ్యలో అనుచర గణం వుంది . ఆయన తన రాజకీయ అడుగులు కాంగ్రెస్ వైపు ఘర్ వాపసీ అవుతారని రాజకీయ వర్గాల్లో వినికిడి .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments