Saturday, December 21, 2024
spot_img
HomeNewsదుబ్బాక యోధుడు రఘన్న .. దారెటు ...!?

దుబ్బాక యోధుడు రఘన్న .. దారెటు …!?

ార్టీ మారే ఆలోచనలో రఘునందన్ రావు!? నిజానిజాలేంటి ?

తెలంగాణ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. ఇన్ని రోజులు ఫుల్ జోష్‌లో ఉన్న తెలంగాణ బీజేపీ.. ఇప్పుడు పూర్తిగా వెనుబడిపోయిందనే చెప్పాలి. పార్టీలోని అంతర్గత విభేదాలే అందుకు కారణం అని తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగానే.. కొంత మంది నేతలు పార్టీకి అంటీ ముట్టనట్లుగా వుంటున్నారు… కొంతమంది అయితే చూద్దామన్నా కనిపించటం లేదు. నిన్నటి వరకు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఇప్పుడు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు గత కొన్ని రోజుల నుంచి మీడియాలో కనిపించటం లేదంటూ కొత్త అంశం తెరమీదికొచ్చింది. మరి ఆయన సైలెంట్ కావటానికి కారణం ఏంటన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

బయట నుంచి వచ్చిన నేతలకు రాష్ట్ర నాయకత్వానికి మధ్య దూరం వచ్చినట్టు టాక్ వినిపిస్తోంది. దాంతో పార్టీలోని కొంత మంది నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. ఇదే దారిలో వెన్నం శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి . రాష్ట్ర అధ్యక్షుడు బండి సజయ్‌, ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి… ఈ ముగ్గురికి ఒకరంటే ఒకరికి పడటం లేదని సమాచారం. దీంతో.. వెంటనే ఇద్దరు నేతలను ఢిల్లీకి పిలిపించుకుని మరీ అధిష్ఠానం బుజ్జగింపు చర్యలతో పాటు కీలక హామీలు ఇచ్చినట్టు తెలుస్తోంది.

ఇక రఘునందన్ రావు విషయానికి వస్తే… ఆయన ఈ మధ్య పార్టీకి దూరంగా ఉంటున్నారు. రాష్ట్ర నాయకత్వానికి, రఘునందన్‌ రావుకు మధ్య కూడా గ్యాప్‌ వచ్చినట్లు సమాచారం. పార్టీ వ్యవహారాల్లో కీలక బాధ్యతలు ఇవ్వకపోవడమే అందుకు కారణం అని తెలుస్తోంది. ఇదే విషయంపై ఇటీవల జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు రఘునందన్ రావు కంప్లైంట్ చేసినట్టు సమాచారం. తెలంగాణలో బీజేపీకి అంత ఊపు తీసుకొచ్చింది తానేనని.. అలాంటి తనకు ఎలాంటి బాధ్యతలు ఇవ్వకపోవటమేంటన్న అసహనాన్ని రఘునందన్ రావు వ్యక్తపర్చినట్టు సమాచారం.

ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లపై దృష్టి పెట్టిన బీజేపీ అధిష్ఠానం.. ఫైర్ బ్రాండ్ రఘునందన్ రావుకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాను దుబ్బాకలోనే ఉన్నానని.. తనను కొద్ది రోజుల వరకు డిస్ట్రబ్ చేయొద్దంటూ రఘునందన్ రావు చెప్పారని కొంతమంది నేతలు చెప్తున్నారు. మరి ఆయన అసంతృప్తితో ఉన్నారా… అధిష్ఠానం నుంచి పిలుపు వస్తుందని వెయిట్ చేస్తున్నారా..? లేదా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ లలో ఏదోఒక పార్టీలోకి జంప్ అయ్యే ఆలోచనలో ఉన్నారా..? అన్న ప్రశ్నలు వెల్లువెత్తున్నాయి. అయితే ఇది ఎంత వరకు నిజమన్నది మాత్రం తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments