చరవాణితో చెలగాటం వద్దు సర్వేంద్రియానం నయనం ప్రదానం అన్నారు పెద్దలు.
మొబైల్ ఫోన్ సెల్ ఫోన్ అంటే తెలుగులో చరవాణి ,ఈ మధ్య చిన్న వారు పెద్ద వారు వయసు మళ్ళిన వారు ఒక సంవత్సరం లోపు చిన్న పిల్లల తో సహా సెల్ ఫోన్ (చరవాణి) చూడటం ఎక్కువ అయింది అనే చెప్పాలి .
సెల్ ఫోన్ అవసరానికి వాడుకుని మిగతా సమయాల్లో ఈ చరవాణి కి యెంత దూరం అంటే అంత బాగుంటారు ,సెల్ ఫోన్ పదే పదే చూడటం వలన ,కంటిచూపు మందగిస్తోంది ,మెడ నరాల నొప్పులు ,కళ్లకింద నల్ల మచ్చలు ,సెల్ ఫోన్ తల దించి,తల అటు ఇటు మార్చి మార్చి చూడటం వలన తలకు షోల్డర్ కు మధ్యన ఉన్నా మెడమీద ఒక గడ్డ ఏర్పడుతుంది.
సెల్ ఫోన్ చీకటిలో దుప్పటి మూసుకుని చూడటం వలన ఫోన్ యొక్క యల్ ఈ డి కిరణాలూ కంట్లోకి వెళ్లి కంటి చూపు మందగిస్తుంది ,కళ్ళు ఎర్రగా అయ్యి రక రకాల కంటి జబ్బులు కంటి కాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ గా ఉంది.
ముఖ్యముగా తల్లి తండ్రులు ఇంట్లో ఉండే పెద్దలు తమ తమ పనులు ఆగిపోతున్నాయి అని పిల్లల చేతిలో సెల్ ఫోన్లు పెట్టి వారి వారి పనులు చేసుకుంటున్నారు ,ఇలా చెయ్యటం వలన పిల్లలు యూట్యూబ్ గేమ్స్ ,ఆన్లైన్ గేమ్స్ అలవాటు పడిపోతున్నారు ,అతి చిన్న వయసులోనే కంటి చూపు కోల్పోతున్నారు లేని పోనీ ఆరోగ్యసమస్యలు తెచ్చుకుంటున్నారు ,అంతే కాక గేమ్ హ్యాకర్స్ చేతిలో అకౌంట్లో ఉన్న డబ్బులు పోగొట్టుకుంటున్నారు .
రోజు రాత్రి పూట పడుకునే ముందు ఫోన్ చూసి ఎట్టిపరిస్థితుల్లో పడుకోవద్దు ఎందుకంటె ఫోన్ స్క్రీన్ ఫ్లాష్ మీ కంట్లో పడి మీ కంటి రెటీనా పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది .
పడుకునే గంట ముందే ఫోన్ ద్వారా జరిగే మీ మీ ఆఫీసు వ్యవహారాలు సొంత పనులు పూర్తిచేసుకుని హాయిగా నిద్రపోండి . మీరు ఎంత సంపాదించిన ఆ కళ్ళు సురక్షితంగ ఉండాలిగా . మొబైల్ ఫోన్ ని అవసరమైన అంత వరకు వాడి ఆనందముగా ఉండండి . సర్వేంద్రియానం నయనం ప్రదానం .