మీకు షుగర్ ఉందా ?
ఈ రెండు చిన్న చిట్కాలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోండి ,
ఈ షుగర్ వలన కిడ్నీలు ,కంటి చూపు బలహీనం అవుతాయి ,మొదటిది మీరు రాత్రి పడుకునే ముందు ఒక స్పూన్ మెంతులు కడిగి నీటిలో నాన పెట్టుకుని ,మరుసటి రోజు ఉదయం లేచిన తరువాత కాలకృత్యాలు తీర్చుకుని ,మీ రోజువారీ మొట్టమొదటి ఆహారముగా మీరు రాత్రి నీటిలో నానపెట్టిన మెంతులు తినేసేయండి ,ఇది మీ షుగర్కు మొదటి దివ్య ఔషధము .
ఇక రెండవ చిట్కా ,ఒక బూడిద గుమ్మడికాయ తీసుకుని ,కాయ పైన ఉండే తెల్లని బూడిద పోయే అంత వరకూ శుభ్రముగా కడుక్కుని పెట్టుకోండి.
కాయ తొడిమ భాగం ఉంచి ,కాయ చివరి భాగం నుచి ఒక రౌండ్ స్లైస్ {ఆఫ్ ఇంచ్ } కోసి చిన్న ముక్కలుగా చేసుకుని మిక్సీలో కట్ చేసిన ముక్కలు వేసి కొంచెం కొంచెంగా నీళ్లు కలుపుతూ 250 ఎంల్ గ్లాస్ జ్యూస్ అయ్యేలా చేసుకుని ,రోజు ఉదయం అల్పాహారాని కి ముందు తాగండి .
ఒక అరగంట వరకు ఏ విధమైన ఆహరం తీసుకోకండి . ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ నరాల వీక్నెస్ ని తగ్గిస్తుంది ,షుగర్ని కంట్రోల్ లో ఉంచుతుంది ,కంటిచూపుని మెరుగు పరుస్తుంది . మిగిలిన బూడిద గుమ్మడి కాయ ఒక కవర్లో పెట్టుకుని ఫ్రిజ్లో పెట్టుకోండి పాడవకుండా ఉంటుంది. ఇలా మీరు రోజు చెయ్యటం వలన మీ షుగర్ మీ పూర్తీ కంట్రోల్ లో ఉంటుంది మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఆరోగ్యమే మహాభాగ్యం మా చిట్కాలే మీకు సంపూర్ణ ఆరోగ్యం.