తెలంగాణ లో రాజకీయాలు ఎన్నడూ లేనంత హాట్ గా వున్నాయి . ఇక తెలంగాణ కాంగ్రెస్ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనే రీతిలో ఎన్నికల పోరాటం లో వుంది . ఇక అధికార భారాసా కు సీఎం కెసిఆర్ తన సుడిగాలి పర్యటనలతో నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు . తెలంగాణ కాంగ్రెస్ రాహుల్ గాంధీ నేతృత్వం లో భారాసా ను ఢీ అంటే ఢీ అనే రీతిలో ప్రచార పర్వం లో వుంది .
ఇక తెలంగాణ భాజాపా జనసేనతో పొత్తు ఖరారు చేసుకొని ఇప్పుడిప్పుడే ఎన్నికల గోదాలోకి దిగుతోంది . తెలంగాణ భాజాపా ముఖ్య నాయకులను కోల్పోతూ తన ఉనికిని కోల్పోతూ సుమారు 20 నియోజకవర్గాలు మినహా ప్రధాన ముక్కోణ పోటీ ఇవ్వలేని పరిస్థితి . దీనికి స్వయంకృతాపరాధమే ప్రదాన కారణం గా వుంది . బండి సంజయ్ ను తొలగించిన పిదప తెలంగాణా భాజాపా స్థబ్ధత కు గురైందనే చెప్పాలి .
చేరికల , ప్రచార కమిటీల చైర్మన్ గా వ్యవహరిస్తున్న ఈటెల వ్యవహారశైలి తో తెలంగాణ భాజాపాకు కొత్త తలనొప్పులు వస్తున్నాయి . కొత్తవారు రాకపోగా వున్నా నాయకులే బయటకు పోతున్నారు . వారిని ఈటెల నిలవరించలేకపోవడం విశేషం . నిజానికి ఈటెల భాజాపాలోకి అడుగు పెట్టిన తదుపరి , వేగం గా పతనం దిశగా ప్రయాణం మొదలు పెట్టింది . ఇక తాజాగా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు వేలు పెడుతున్నాడంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను గెలిపించే ప్రయత్నం చేస్తున్నారన్నారు ఈటెల.
నిజానికి చంద్రబాబు నాయుడు అరెస్ట్ తదుపరి తెలంగాణ లో తెలుగుదేశం పోటీ నుంచీ విరమించుకొందనే విషయం తెలిసిందే . చంద్రబాబు అరెస్ట్ ను అన్ని రాజకీయ పార్టీలు ఖండింఛాయి . అందుకు చంద్రబాబు స్వయంగా భాజాపా నాయకులకు తన కృతఙ్ఞతలు తెలిపారు కూడా . అయినా ఎన్నికల తరుణం నాలుగు ఓట్లు తాను వున్న పార్టీ కి తెచ్చే విధం గా వ్యాఖ్యలు ఉండాలి కానీ , పోగొట్టుకొని విధం గా ఉండరాదు అనేది సహజ నియమము . ఈటెల చేసిన వ్యాఖ్యలను టీటీడీపీ సీనియర్ నేత అర్వింద్ కుమార్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. బీజేపీ (BJP) నేతలు ఎన్టీఆర్ (NTR) జపం చేయటం లేదా? అని ప్రశ్నించారు. బీసీ వర్గాలను ప్రోత్సహించిన టీడీపీపై ఈటల కామెంట్స్ శోచనీయమన్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం బీఆర్ఎస్ సహా కాంగ్రెస్ నేతలు.. చంద్రబాబు జపం చేస్తున్నారని తెలిపారు. ఓట్ల కోసం చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడుతున్నారన్నారు. బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని మొదట ప్రకటించిందే టీడీపీ అని చెప్పుకొచ్చారు. కొన్ని ప్రత్యేక కారణాల వలనే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్నామని తెలిపారు. చంద్రబాబు సమయం ఇవ్వలేరన్న కారణంగానే పోటీకి దూరంగా ఉన్నట్లు వెల్లడించారు. బడుగు బలహీన వర్గాలకు కేరాఫ్ అడ్రస్ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. సేవాభావంతో పుట్టిన పార్టీ తెలుగుదేశం అని అర్వింద్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు..
ఏది ఏమైనా ఈటెల వ్యాఖ్యలు చెప్పకనే తెదేపా సానుభూతి పరుల ఓట్లను భాజాపా కు దూరం చేసే విధం గా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు . భాజాపా నుంచీ కాంగ్రెస్ కు వలసలు , చంద్రబాబు ను విమర్శించడం ద్వారా ఈటెల ఒక విధం గా రాబోయే ఎన్నికల్లో తనకు తెలిసో , తెలియకో కాంగ్రెస్ కు మేలు కలిగించే విధం గా ఆయన పనులు ఉన్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి .