Tuesday, December 3, 2024
spot_img
HomeNewsAndhra Pradeshమైలవరం అసెంబ్లీ బరిలో ఉద్దండులు ... హోరాహోరీ .. గెలుపు గుర్రం ఎక్కేదెవరో !?

మైలవరం అసెంబ్లీ బరిలో ఉద్దండులు … హోరాహోరీ .. గెలుపు గుర్రం ఎక్కేదెవరో !?

ఉమ్మడి కృష్ణ జిల్లా లోని ముఖ్యమైన నియోజకవర్గం మైలవరం . ఇది విజయవాడ లోకసభా పరిధిలోనిది . ఇక్కడ గత 2019 ఎన్నికల్లో దేవినేని ఉమా ను 12 వేలకు పైగా తేడా తో ఓడించి వసంత కృష్ణ ప్రసాద్ గెలుపొందారు . ఈయన మాజీ హోమ్ మంత్రి వసంత నాగేశ్వరావు కుమారుడే . ఐతే ఈ ఇరువురు 2009 లో నందిగామ శాసనసభ Reserved నియోజకవర్గం కావడం తో ఈ నియోజకవర్గానికి దిగుమతి అయ్యారు .

దేవినేని ఉమా ఇక్కడ నుంచీ రెండు సార్లు 2009 , 2014 లలో వరుస విజయాలు సాధించారు . ఒకప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లా మొత్తం పట్టు ఉండి , ప్రస్తుతం నియోజకవర్గానికే పరిమితమయ్యారు. మైలవరం నుంచీ గతం లో చనుమోలు వెంకటరావు 5 పర్యాయాలు గెలిచి నలుగురు ముఖ్యమంత్రుల వద్ద మంత్రి గా పనిచేశారు . ఇదే నియోజకవర్గం నుంచీ జేష్ఠ రమేష్ 2 సార్లు పోటీ చేసి ఒక సారి అతి తక్కువ ఓట్లతో ఒడి , మరోసారి గెలిచారు . ఇక ఇదే స్థానం నుంచీ ఉయ్యురు కు చెందిన వద్దే శోభనాద్రీశ్వర రావు కూడా తెదేపా అభ్యర్థి గా ఒకసారి గెలిచి మంత్రిగా చంద్రబాబు కాబినెట్ లో పని చేశారు . 2004 లో ఓడి క్రియాశీల రాజకీయాల నుంచీ దూరమయ్యారు .

రాబోయే శాసనసభ ఎన్నికల్లో నువ్వా నేనా అనే రీతిలో వసంత , దేవినేని ల మధ్య పోటీ జరగనుంది … మరిన్ని వివరాలకోసం ఈ క్రింది వీడియో చుడండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments