రాష్ట్ర ప్రజలు భారీ వర్షాల వలన వరదల్లో అల్లాడుతుంటే జగన్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తి నట్లుందన్నారు మాజీ మంత్రి దేవినేని ఉమ. నీటి ప్రాజెక్టుల్లో నీళ్ళు ఉన్నా కాలువల ద్వారా పొలాలకు తీసుకెళ్లలేని అసమర్థుడు జగన్ అన్నారు. జగన్ ది చెత్త ప్రభుత్వం . CM Jagan reddy బాధ్యత లేదా అంటూ ఉమా ధ్వజమెత్తారు . పట్టిసీమ దండగని బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారు. కోస్తాంధ్రలో ప్రాజెక్టులు పడకేశాయు. పోలవరం ప్రాజెక్టుకు జగనే శని అంటూ వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు తీసుకురాలేక పోతున్నారని.. వైసీపీ ఎంపీలు ఢిల్లీలో గడ్డి పీకుతున్నారా అంటూ మండిపడ్డారు. పోలవరం నిర్వాసితులు నీళ్ళలో మునిపోయారని… పశువులు నీళ్ళలో కొట్టుకుపోతున్నాయని దేవినేని ఉమా అన్నారు . జగన్ తండ్రి వైస్సార్ విగ్రహం పోలవరం ప్రాజెక్టు వద్ద పెడతారని ఉమా ప్రశ్నించారు.
పోలవరం నిర్వాసితులను వరద నీటిలో ముంచినందుకు పోలవరం వద్ద వైఎస్ విగ్రహాన్ని పెడతారా అని దేవినేని ఉమా నిలదీశారు. పోలవరం ప్రాజెక్టు పనులు 72 శాతం టీడీపీ ప్రభుత్వంలో పూర్తి కాగా , పోలవరం ప్రాజెక్టు చూడటానికి వెళ్తే తనను పోలీసు స్టేషన్‌లో పెట్టారని.. చంద్రబాబు వెళ్తే ప్రొక్లైన్లు అడ్డం పెట్టారన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞం ధనయజ్ఞం చేశారని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ బాబాయ్ హత్య కేసులో బీజీగా ఉన్నారు. హత్య కేసులో వాస్తవాలు బయటపడగానే ప్రజలు జగన్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలుపుతారు. ప్రతి నెలా కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని దేవినేని ఆరోపించారు. ప్రజల్లో చైతన్యం కోసం చంద్రబాబు ప్రాజెక్టుల వద్ద నిద్ర చేయబోతున్నారన్నారు. రాష్ట్రంలో వ్యవసాయశాఖకు తాళాలు వేశారన్నారు. ‘‘మా మీద కక్ష ఉంటే మామీద తీర్చుకోండి… పోలవరం నిర్వాసితులకు వేధించొద్దు. పోలవరం బాధితుల ఉసురు జగన్ ప్రభుత్వానికి తగులుతుంది’’ అంటూ దేవినేని ఉమా మహేశ్వర్‌రావు తీవ్రం గా హెచ్చరించారు.