Wednesday, January 15, 2025
spot_img
HomeElections 2023-2024ఢిల్లీకి సీఎం రేవంత్కొత్త మంత్రులు, లోక్ సభ అభ్యర్థుల పై క్లారిటీ..?

ఢిల్లీకి సీఎం రేవంత్కొత్త మంత్రులు, లోక్ సభ అభ్యర్థుల పై క్లారిటీ..?

ఢిల్లీకి సీఎం రేవంత్
కొత్త మంత్రులు, లోక్ సభ అభ్యర్థుల పై క్లారిటీ..?

హస్తినకు బయల్దేరిన సీఎం రేవంత్ రెడ్డి
ఏఐసీసీ పెద్దలతో సీఎం రేవంత్ భేటీ
లోక్ సభ అభ్యర్థుల పై క్లారిటి రానుందా
మంత్రివర్గ విస్తరణ పార్లమెంట్ ఎన్నికల ముందే జరుగనుందా
రేవంత్ రెడ్డి టీంలో కొత్త మంత్రులెవరో తేలనుందా
కేంద్రమంత్రులతో CM రేవంత్ భేటీ అందుకేనా

సోమవారం రోజున హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి స్పెషల్ ఫ్లయిట్ లో తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు ఢిల్లీకి వెళ్లారు.
సీఎం రేవంత్‌రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హస్తినకు చేరుకున్నారు. సీఎం రేవంత్ నిర్వహించారు ఏఐసీసీ నేత రణ్‌దీప్‌ సూర్జేవాలా కుమారుడి వివాహానికి హాజరైన వధూవరులను ఆశీర్వదించారు. ఇవ్వాళ ఏఐసీసీ పెద్దలను కలిసే అవకాశమున్నట్టు టీపీసీసీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ సంస్థాగత కార్యక్రమాల ఇన్‌చార్జి కె.సి.వేణుగోపాల్‌ సహా వీలును మరికొందరు పెద్దలతో వీరు సమావేశమవుతారని తెలిపారు.రాష్ట్రానికి అందించాల్సిన ఆర్థిక సాయంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ కూడా కలిసి వినతిపత్రం ఇవ్వనున్నారు.

Delhi CM Revanth

ఈ ముగ్గురూ పార్టీ హైకమాండ్‌ను కలిసి రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంతో పాటు నామినేటెడ్ పోస్టుల గురించి హైకమాండ్‌తో చర్చించిన తర్వాత కొంత స్పష్టత వస్తుందని తెలుస్తోంది.
ఈ భాగాలతో పాటు కీలకమైన కేబినెట్ విస్తరణ గురించి కూడా చర్చ జరుగుతుందని సమాచారం. అయితే, కేబినెట్‌ విస్తరణ లోక్‌సభ ఎన్నికల తర్వాత ఉంటుందా? ఇప్పుడే ఉంటుందా అన్న దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.సిఎం రేవంత్‌ మాత్రం మంత్రివర్గ విస్తరణ గురించి ఇప్పటికే ఓ అభిప్రాయానికి వచ్చారని, ఒకవేళ ఈ పర్యటనలో హైకమాండ్‌తో ఈ అంశంపై చర్చ జరిగితే, ఢిల్లీ పెద్దల నుంచి గ్రీన్‌సిగ్నల్‌ వస్తే త్వరలోనే మంత్రివర్గ ప్రమాణ స్వీకారం ఉంటుందని, లేదంటే పార్లమెంటు ఎన్నికల ఫలితాల వరకు ఆగాలని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు.

కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థులెవరో పరిశీలిద్దాం..?

అదిగో, ఇదిగో అంటూ ఊరిస్తున్నా రానున్న పార్లమెంట్ ఎన్నికల కోసం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల విషయంలో కూడా పార్టీ నాయకత్వం క్రమ క్రమంగా ఓ అభిప్రాయానికి వస్తున్నట్లు అర్థమవుతోంది.హైదరాబాద్, కరీంనగర్ మినహా 15 స్థానాల్లో పోటీకి ఎవరిని దింపాలన్న దానిపై షార్ట్ లిస్ట్ రెడీ అయిందని, ఈ జాబితాను ఇప్పటికే హైకమాండ్‌కు పంపారని, ఎన్నికల కమిటీ భేటీ అనంతరం ఇటీవలి కాలంలో జరుగుతున్న చేరికలు కూడా పార్లమెంటు అభ్యర్థిత్వాల చుట్టూ తిరుగుతున్నాయి. ఐతే పార్లమెంట్ స్థానాల్లో ఈ అభ్యర్థులను ఎంపిక చేసే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ప్రచారం జరుగుతుంది.

సికింద్రాబాద్‌ నుంచి బొంతు రామ్మోహన్‌,
మెదక్ నుంచి నీలం మధు,
చేవెళ్ల నుంచి పట్నం సునీతారెడ్డి,
పెద్దపల్లి నుంచి వెంకటేశ్‌ నేతకాని,
మల్కాజ్‌గిరి నుంచి కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి,
వరంగల్‌ నుంచి అద్దంకి దయాకర్ లేదా తాటికొండ రాజయ్య కు
లోక్‌సభ అభ్యర్థుల విషయంలో స్పష్టత వచ్చిందనే చర్చ జరుగుతోంది.
దీనికి తోడు నల్లగొండ, భువనగిరి, పెద్దపల్లి, ఖమ్మం స్థానాల్లో పార్టీ నేతల బంధువులు, కుటుంబ సభ్యులు టికెట్లు అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో లోక్‌సభ అభ్యర్థిత్వాల విషయంలో అనుసరించనున్న మార్గదర్శకాలపై కూడా సీఎం రేవంత్ సహా కాంగ్రెస్‌ ముఖ్య నేతలు ఢిల్లీ పెద్దలతో చర్చిస్తారని టీపీసీసీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments