తెలంగాణలో కాంగ్రెస్ “ఆపరేషన్ ఆకర్ష్” సక్సెస్
వరంగల్ లో కాంగ్రెస్ ఆపరేషన్ తో.. కారు పార్టీ కాళీ
కాంగ్రెస్ లోకి భారీ చేరికలు
సీఎం రేవంత్ ని కలిసిన మేయర్ గుండు సుధారాణి
వరంగల్ గడ్డ.. కాంగ్రెస్ అడ్డాగా మారనుందా
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఏన్నికల ఆపరేషన్ మొదలు పెట్టింది. 15 సీట్లు ఏమాత్రం తగ్గకుండా గెలవాలనే లక్ష్యం పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ, కింద స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకు సాగుతుంది.దీనిలో భాగంగానే చేరికలపై దృష్టి సారించింది. మొదటి రౌండ్‌లో కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు ఏర వేసింది.దీని తదనంతరం కంటోన్మెట్ బోర్డుతో పాటు పంచాయితీ స్థాయిలో చేరికలను చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది .
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 128 పురపాలక సంఘాలు,13 నగరపాలక సంస్థలు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులలోని ప్రముఖ నాయకులందరికీ కాంగ్రెస్ కండువాలు కప్పాలని పార్టీ ఆలోచిస్తున్నట్లు సమాచారం.తాజాగా జిల్లా ఇన్ చార్జ్ మంత్రుల ఆధ్వర్యంలో చర్చలు జరుగుతుండగా ,అతి త్వరలోనే వరుస చేరికలకు కాంగ్రెస్ ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తుంది .హైదరాబాద్, వరంగల్‌తో పాటు మరో 11 నగర పాలక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ జాయినింగ్స్ నిర్వహించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి .రేపు మహబూబ్ నగర్‌లో మొదలు కానున్న పార్లమెంట్ శంఖారావంతో ఈ కార్యక్రమం మొదలు కానున్నది.సీఎం రేవంత్ రెడ్డి నేరుగా రంగంలోకి దిగనున్నారు. పార్టీలో చేరికలను ప్రోత్సహిస్తూ, బీజేపీ దూకుడును దాటుకుని దూసుకుపోయేలా సీఎం రేవంత్ వ్యూహాలను అమలు చేయనున్నారు.బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలలో ఉన్న అసంతృప్తి నేతలను గుంజుకు పోవడమే కాంగ్రెస్ తనప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నది.
అసంతృప్తి నాయకులలో భాగంగానే వరంగల్ మేయర్ గుండు సుధారాణితో కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక చర్చలు పూర్తయినట్లు గాంధీభవన్ లో ప్రచారం జరుగుతోంది .మేయర్ గుండు సుధారాణితో పాటు 15 మంది కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు గాంధీభవన్ వర్గాలు తెలిపాయి.తాజాగా ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, హైదరాబాద్ ఇన్ చార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో పలువురి కార్పొరేటర్లతోనూ చర్చలు జరిపినట్లు తెలుస్తుంది .ఎంపీ ఎన్నికల లోపే వీళ్లందరికీ కాంగ్రెస్ కండువాలు కప్పాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం .మిగతా కార్పొరేషన్ల మేయర్లతోనూ మొదటి దశలో చర్చలు జరుగుతున్నట్లు కాంగ్రెస్ పార్టీలో టాక్ వినిపిస్తున్నది .నిజం చెప్పాలి అంటే GHMC పరిధిలో కాంగ్రెస్ పార్టీ కేవలం ఇబ్రహీంపట్నం ఒక్క సీటుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.దీంతో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ అసంతృప్తి నేతలను, గ్రౌండ్ లీడర్లు, కేడర్‌ను ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా వచ్చిన వారికీ కాంగ్రెస్ కండువా కప్పితే , పార్లమెంట్ ఎన్నికలతో పాటు వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జెండాను ఎగురవేయొచ్చని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ప్లాన్ చేసిన్నట్లు సమాచారం .