Saturday, September 14, 2024
spot_img
HomeNewsఎన్నికల సమయంలో కేసీఆర్‌ ని ప్రజలు తరిమి తరిమి కొట్టకపోతే పేరు మార్చుకుంటా..కాంగ్రెస్ నేత షబ్బీర్...

ఎన్నికల సమయంలో కేసీఆర్‌ ని ప్రజలు తరిమి తరిమి కొట్టకపోతే పేరు మార్చుకుంటా..కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ

Kamareddy: కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ వ్యాఖ్యలపై తీవ్రంగా ఫైర్ అయ్యారు. మంత్రి కేటీఆర్ ఖబడ్దార్ అంటూ మాజీ మంత్రి షబ్బీర్ అలీ వార్నింగ్ కూడా ఇచ్చారు. రాబోయే ఎన్నికల సమయంలో కేసీఆర్‌ ని ప్రజలు తరిమి తరిమి కొట్టకపోతే తన పేరు మార్చుకుంటానన్నారు షబ్బీర్ ఆలీ . తెలంగాణకు కాంగ్రెస్ ఏం చేసిందో మీ నాయనని అడగమని కేటీఆర్‌కి షబ్బీర్ సలహా చెప్పారు.

రాజకీయంగా కేసీఆర్‌కి కాంగ్రెస్ పార్టీ జన్మనిచ్చిందన్నారు . కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ, షబ్బీర్ అలీ ఏం పీకారని కేటీఆర్ అనడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ ఉద్యమ సమయం లో కేటీఆర్ అమెరికాలో ఉన్నాడని షబ్బీర్ అలీ తెలిపారు. షబ్బీర్ అలీ ఏం పీకాడో అసెంబ్లీలో కేసీఆర్ చెప్పారన్నారు.

  • గతం లో కేసీఆర్ కుటుంబానికి ఉండడానికి ఇల్లు కూడా లేదని… ఇప్పుడు కోటీశ్వరులు అయ్యారు.
    •  కాంగ్రెస్ ఓఆర్ఆర్ వేస్తే.. బీఆర్ఎస్ నాయకులు సంపాదించుకుంటున్నారు .
    • తెలంగాణ భూములు అమ్మి ఏం చేయాలనుకుంటున్నారు .
    • కేటీఆర్ 100 రోజుల తరువాత ఎక్కడ ఉంటావో చూసుకో..కేటీఆర్ కి తగిన బుద్ధి త్వరలోనే చెబుతా.
    • ఇక కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తానంటే అది ఆయన ఇష్టం .. తాను మాత్రం కాంగ్రెస్ తరపున కామారెడ్డి అసెంబ్లీ నుంచీ పోటీ చేస్తున్నానని షబ్బీర్ అలీ తెలిపారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments