రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలోని రాజీవ్ గాంధీ ప్రాంగణంలో ‘విజయభేరి’ దిగ్విజయం . కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ , రాహుల్ గాంధీ , మల్లిఖార్జున ఖర్గే లు ప్రసంగించి విజయభేరి మ్రోగించారు .
కాంగ్రెస్ అంచనాలను మించిన ప్రజా వాహిని …10 లక్షలకు పైగా హాజరు
తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే Sonia Gandhi.
- చారిత్రాత్మకమైన రోజున తెలంగాణ ప్రజలకు గ్యారెంటీలు ఇస్తున్నాం
tukkuguda సభావేదికగా సోనియా గాంధీ, ఖర్గే, రాహుల్ కీలక ప్రకటనలు చేశారు . తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ కీలక వాగ్దానాలు ఇచ్చింది.
6 గ్యారంటీ పథకాలు :-
- గృహ జ్యోతి : ప్రతి కుటుంబానికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్
- రైతు భరోసా : భూమి ఉన్న రైతులకు, భూమి లేని కౌలు రైతులకు ఏటా రూ.15,000
- గుంట భూమి లేని కూలీలకు ఏటా రూ.12,000, వరి పంటకు రూ.500 బోనస్
- చేయూత : రూ.4,000 పెన్షన్
- ఇందిరమ్మ ఇళ్లు : ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, రూ.5 లక్షలుఉద్యమకారులకు 250 చదరపు గజాల స్థలం
- మహాలక్ష్మి : ప్రతి మహిళకు నెలకు రూ.2,500, రూ.500కి గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
- యువ వికాసం : విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు.
తెలంగాణలో BRS, బీజేపీ, ఎంఐఎం కలిసి పనిచేస్తున్నాయి.. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సోనియా తెలంగాణ ఇచ్చారు..రాహుల్ గాంధీ .
తెలంగాణ ఏర్పడిన ప్రతిఫలం అంతా కేసీఆర్ కుటుంబం అనుభవిస్తుంది
ఇన్నిరోజులు కాంగ్రెస్‌ను పెద్దగా లెక్కచేయని భారాసా .. ఒక్కసారిగా సోనియా, రాహుల్ ఇలా ప్రకటనలు చేసే సరికి మైండ్ బ్లాంక్ అయ్యిందని కాంగ్రెస్ శ్రేణులు సోషల్ మీడియాలో కామెంట్స్
తెలంగాణలో ‘బుక్ మై సీఎం’ అనే ప్రకటనలతో కేసీఆర్ అంటే ఏంటో.. ప్రజలకు ఏ మాత్రం చేశారనే విషయాలను ఇలా పోస్టర్లు, బ్యానర్లు ద్వారా తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా విజయభేరి సభలో ఇలా కాంగ్రస్ ‘సిక్సర్’