Friday, October 18, 2024
spot_img
HomeNewsఆప్ (AAP ) .. ప్రజాస్వామ్య భారత్ పై సిరా మరక !?

ఆప్ (AAP ) .. ప్రజాస్వామ్య భారత్ పై సిరా మరక !?

ఢిల్లీ లో మొట్టమొదటి ముఖ్యమంత్రి చౌదరి బ్రహ్మ ప్రకాష్ యాదవ్ (1951). తదుపరి స్టేట్ రి – ఆర్గనైజషన్ చట్టం ప్రకారం అసెంబ్లీ గా మారిన తదుపరి 1993 లో జరిగిన ఎన్నికల్లో భాజాపా ప్రభుత్వం 3 ముఖ్యమంత్రుల ఆధ్వరంలో 1998 వరకూ నడిచింది . వారే మదన్ లాల్ ఖురానా , సాహిబ్ సింగ్ వర్మ , సుష్మ స్వరాజ్ . 1998 లో షీలా దీక్షిత్ ముఖ్యమంత్రి గా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది . ఆ కాలంలోనే కేంద్రం లో భాజాపా నేతృత్వాన NDA (1) అధికారం లోకి వచ్చింది . భాజాపా 1998 నుంచీ ఇప్పటి వరకూ 25 సంవత్సరాల కాలం లో 15 సంవత్సరాల కాలం అధికారం లో వుంది . కానీ ఢిల్లీ ప్రజలు ఎన్నిక ద్వారా భాజాపాను 1998 నుంచీ దూరంగానే ఉంచారు .

లోకసభ ఎన్నికల్లో భాజాపాను గెలిపించినా ఢిల్లీ అసెంబ్లీ కి 1998, 2004, 2008 లలో వరుసగా కాంగ్రెస్ ను గెలిపించారు . ఆ దశలోనే 15 ఏళ్ళ కాంగ్రెస్ పాలన పట్ల విసుగు చెందిన ఢిల్లీ ప్రజలు అన్నా హజారే తో పాటు అవినీతి కి వ్యతిరేకం గా జరిగిన ఉద్యమం లో పనిచేసిన మాజీ IRS అధికారి అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వాన అధికారం లోకి వచ్చారు . ఇక 15 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ప్రతిపక్ష హోదా కరువై చివరికి 2020 నాటికి ఒక్క స్థానం లో కూడా గెలువలేని స్థితి దాపురించింది . ఇక 2013 లో అధికారం లోకి వచ్చిన ఆప్ పార్టీ 2013, 2015, 2020 లో అన్ని పక్షాలనూ ఊడ్చేసింది .

ఆప్ తమ పార్టీని జాతీయ పార్టీ గా కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయ పార్టీ గా మలచుకొనే ప్రయత్నం లో భాగం గ్గా పలు రాష్ట్రాల్లో పోటీ చేసి కాంగ్రెస్ ను ఆయా రాష్ట్రాల్లో నిలువరించింది . ముఖ్యంగా చిన్న రాష్ట్రాల్లో ఉదా: గోవా 2022 శాసనసభ ఎన్నికల్లో పోటీకి దిగి 2 స్తనాలు గెలిచి కాంగ్రెస్ ను దెబ్బ తీసింది . ఇక పంజాబ్ లో ఏకా ఏకీ కాంగ్రెస్ ను ఓడించి 92/117 స్థానాల తో అధికారం లోకి రావడం జరిగింది. అయితే మ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీల క్లబ్‌లో చేరడానికి కేవలం ఒక దశాబ్దం పట్టింది. ప్రస్తుతం భారతదేశంలో కేవలం తొమ్మిది రాజకీయ పార్టీలకు మాత్రమే ఈ ప్రత్యేకత ఉంది. 2012లో స్థాపించబడిన ఆప్ చేతిలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి మరియు అనేక రాష్ట్ర అసెంబ్లీలలో ఆప్ తన ఉనికిని కలిగి ఉంది. అయితే ప్రస్తుత లోక్‌సభ ఎంపీ లేరు. రాజ్జసభ లో మాత్రం 8 మంది సభ్యులున్నారు .

ఆప్ : పతనం దిశగా … మన్మోహన్ సింగ్ ప్రభుత్వ అవినీతి కి వ్యతిరేకంగా ఉద్యోగులు , మధ్యతరగతి ప్రజలు , సాధారణ గృహిణులు , మేధావులు , సామాజిక కార్యకర్తలు ఎన్నో ఆశలతో అప్ ప్రభుత్వాన్ని ఢిల్లీలో ఎన్నుకొన్నారు . కాంగ్రెస్ ప్రభుత్వం 2014 లో ఓటమికి ప్రధాన కారణాల్లో ఆప్ కూడా ఒకటి . ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఇతర పార్టీలను ఏక కాలం లో మట్టి కరిపించి పంజాబ్ లో అధికారం లోకి వచ్చింది . ఇక గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గణనీయమైన ఫలితాలను సాధించింది . విప్లవం లోనే ప్రతి విప్లవం ఉంటుందనేది తెలిసిన విషయమే … ఆప్ భారత రాజకీయ యవనిక పై యువత , ఉద్యోగ , మహిళ, మధ్యతరగతి ఆశాజ్యోతి గా రాజకీయ యవనిక పైకి దూసుకొచ్చింది . ఢిల్లీ ఎన్నికల్లో మాత్రమే ధనమ్ లేకుండా గెలిచినా అప్ గుజరాత్ , పంజాబ్ ఎన్నికల్లో ప్రధాన రాజాకీయ పార్టీలకు పోటీగా ధనాన్ని ఎలా ఖర్చు చేయగలిగిందనే ప్రశ్న ఉదయుంచింది . ఇక ఆప్ తో ముప్పు పొంచి వున్నదని గ్రహించిన కేంద్రం లో అధికారం లో వున్నా భాజాపా తమ అధీనం లో వున్న నిఘా సంస్థలను నిద్ర లేపింది .

ఆప్ పార్టీ ని స్థాపించినప్పుడు,తమ పార్టీ నాయకులపై ఎలాంటి అవినీతి ఆరోపణలు వచ్చినా వినడానికి లోక్‌పాల్‌కు నిబంధనలు ఉన్నాయి. మొదట్లో లోక్‌పాల్‌ని నియమించినా తర్వాత ఆ పద్ధతిని తర్వాత రద్దు చేశారు. ఇప్పుడు లోక్‌పాల్ గురించి ఎవరూ మాట్లాడరు. ఇక లౌకిక పార్టీ గా ప్రయాణం మొదలెట్టిన ఆప్ ఇప్పుడు హిందుత్వ లో భాజాపా తో పోటీ పడుతున్నట్లు గా వుంది . ఇందుకు నిదర్శనాలు అనేకం . హనుమాన్ చాలీసా పఠనం , దీపావళి పూజ లైవ్ , జై శ్రీరామ్ నినాదాలు ఇలా చాలానే వున్నాయి .  ఢిల్లీ లిక్కర్ పాలసీ విషయంలో ఆప్ అగ్ర నేతలపై కేంద్ర సంస్థలు కేసులు పెట్టినా ఎవరూ ఆశ్చర్యపోలేదు. డబ్బులు చేతులు మారాయని ఆరోపించారు. సాక్షాత్తు ఆప్ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఢిల్లీ లిక్కర్ స్కాం లో జైలు లో వున్నారు. దీని మూలాలు అవినీతిలో కూరుకుపోయిన తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వున్నాయి . కెసిఆర్ కుమార్తె కవిత పేరు కూడా ప్రముఖం గా వినిపించింది . ED విచారణను కూడా ఎదుర్కొన్న విషయం తెలిసిందే . ఢిల్లీ, పంజాబ్‌లలో చాలా మంది ఆప్‌ నాయకులు, ఎమ్మెల్యేలు అవినీతిలో కూరుకుపోయారని నేడు సర్వత్రా వినిపిస్తున్న మాట..

మీరు (కేజ్రీవాల్) మీ స్వరాజ్ పుస్తకంలో మద్యపాన విధానాలపై ఆదర్శప్రాయమైన విషయాలు రాశారు , దానికి మీరు నన్ను ఉపోద్ఘాతంగా వ్రాసారు … మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ఆదర్శాలను మరచిపోయారు”  అని అన్నా హజారే లేఖ లో పేర్కొన్నారు . మద్యం వలె, అధికారం కూడా మత్తును కలిగిస్తుంది. సీఎం అయ్యాక మీ ఆదర్శాలను మర్చిపోయారన్నారు అన్న హజారే . ఆప్ 21 వ శతాబ్ది లో బ్యూరాక్రాట్ల విఫల ప్రయోగం

.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments