CM Revanth, who turned the wheel, got his hands dirty..? బిఆర్ఎస్ చోటా బడా కీలక నేతలు ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇప్పటికే పలువురు బారాసా బాజాపా ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. అయితే వారంతా మర్యాదపూర్వకంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసాము అని చెప్తున్నా.. ఏదో జరుగుతుందన్న చర్చ తెలంగాణ రాజకీయాల్లో నడుస్తుంది. దీంతో బిఆర్ఎస్ బీజేపీ పార్టీల్లో గుబులు మొదలైంది. గత పదేళ్లుగా గ్రేటర్ హైదరాబాద్ లో బారాసా కు పెద్ద దిక్కుగా ఉన్న మాజీ మంత్రి తలసాని కూడా, సీఎం రేవంత్ రెడ్డి తో పాత స్నేహం ఉండడంతో ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు టాక్ నడుస్తుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కారు పార్టీ ఓటమి తర్వాత తలసాని ముఖ్య అనుచరులు సైతం కాంగ్రెస్ పార్టీలో చేరారు
ఇప్పుడు అదే తరహాలో లోక్ సభ ఎన్నికల ముందు గులాబీ అధినేత కెసిఆర్ కు బిఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి తలసాని సన్నిహితులు సైతం హస్తం వైపు అడుగులు వేస్తున్నారు. దీంతో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ చూపు కూడా కాంగ్రెస్ వైపు మళ్ళినట్లు ప్రచారం జరుగుతుంది. సనత్ నగర్ లో 2014 నుంచి తలసాని వెంటే ఉంటున్న సరోజినీ దేవి హాస్పిటల్ మాజీ సూపరిండెంట్ రవీందర్ గౌడ్ గత అసెంబ్లీ ఎన్నికల్లో బారాసా ఓటమి తర్వాత పార్టీతో తలసాని తో అంటి ముట్టనట్టుగా వ్యవహరించారు. సో ఈ నేపథ్యంలోనే తలసానికి ముఖ్య అనుచరుడైన డాక్టర్ రవీందర్ గౌడ్ కూడా కారు దిగి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతో పాటు మరికొందరు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ కూడా గ్రేటర్ హైదరాబాద్ లో చాలా వీక్ గా ఉంది. అందుకే కాంగ్రెస్ బారాసా బాజాపా నుంచి ఎవరైనా వస్తే చేర్చుకోవడానికి రెడీగా ఉంది. జిహెచ్ఎంసి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవాలంటే ముందు బలం పెంచుకోవాలి, బలం పెరగాలంటే బారాస భాజాపా పార్టీల నుంచి నేతల్ని చేర్చుకోవాలి.
ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఓడిందంటే పరువు కాస్త గంగలో కలుస్తుంది. అందుకే కాంగ్రెస్ గ్రేటర్ లో పుంజుకోవాలని చాల మంది నేతల్ని కాంగ్రెస్లో చేర్చుకుంటున్నారు. ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికల్లో హైదరాబాద్ లో కమలం గులాబీ పార్టల తో పోలిస్తే కాంగ్రెస్ కు చెప్పుకోదగ్గ స్థానాలు రాలేదు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ పై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఎలాగైనా గ్రేటర్ లో జరగనున్న GHMC ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలని చూస్తున్నారు. దీంతో పాత పరిచయాలను తొవ్వుతున్నారు సీఎం రేవంత్. గతంలో రేవంత్ రెడ్డి తో పాటు తలసాని టిడిపిలో పనిచేశారు ఆ పరిచయంతో తలసానిని కాంగ్రెస్ లోకి ఆహ్వానించాలని చూస్తున్నారు. ఆయన కూడా కాంగ్రెస్లో చేరడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. పదేళ్లు గ్రేటర్ లో తలసాని హావా నడిచింది. ఇప్పుడు కూడా తలసాని హావా కొనసాగాలంటే ఆయన కాంగ్రెస్ లో చేరాక తప్పదు అనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఆయన త్వరలో కాంగ్రెస్ లో చేరటం ఖాయం అన్నట్లు తెలుస్తుంది.