కెసిఆర్ జగన్ కంటే.. సీఎం రేవంత్ “మోస్ట్ పవర్ఫుల్”
తేల్చేసిన “ఇండియన్ ఎక్స్ ప్రెస్” సర్వే..?
సీఎం రేవంత్ రెడ్డి కి… “అరుదైన గౌరవం”
కాంగ్రెస్ శ్రేణులకు.. పిడుగులాంటి “శుభ వార్త”
ఇండియన్ ఎక్స్ ప్రెస్.. “టాప్ మోస్ట్ పవర్ఫుల్” లిస్టులో సీఎం రేవంత్
కెసిఆర్, జగన్ ల కంటే.. సీఎం రేవంత్ “మోస్ట్ పవర్ఫుల్”
డీకే శివకుమార్ కంటే.. “రేవంతే పవర్ఫుల్”
ఈ జాబితాలో.. కెసిఆర్ పేరు గాయబ్
పలు రాష్టాల సీఎం ల కంటే.. రేవంత్ “అడ్వాన్స్”
గత ఎన్నికల్లో.. రేవంత్ “వన్ మ్యాన్ షో”
“ఇండియన్ ఎక్స్ ప్రెస్” లిస్టులో.. రేవంత్ ది 39వ స్థానం
ఇండియన్ ఎక్స్ ప్రెస్ విడుదల చేసిన ది మోస్ట్ పవర్ఫుల్ లీడర్ల లిస్టులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చోటు సంపాదించారు. 2024 సంవత్సరానికి టాప్ మోస్ట్ పవర్ఫుల్ ఇండియన్స్ లిస్టును ఇండియన్ ఎక్స్ ప్రెస్ విడుదల చేయగా. అందులో కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి 38వ స్థానంలో నిలిచారు. ఏపీ ఒడిశా కేరళ ఇలా పలు రాష్టాల సీఎంల కంటే అడ్వాన్స్ లో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే.. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కంటే కూడా రేవంత్ రెడ్డే “పవర్ ఫుల్ పర్సన్” గా చోటు సంపాదించుకున్నారు. 2024 కు ముందు గతంలో రూపొందించిన లిస్టులో రేవంత్ కి చోటు దక్కకపోయినా.. తెలంగాణాలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి పవర్ లోకి రావడం. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టడంతో ఈసారి ఆయన పవర్ఫుల్ పొలిటిషన్ గా గుర్తింపు వచ్చింది. కాగా సింగిల్ హ్యాండ్ గా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ కొట్లాడారని ఇండియన్ ఎక్స్ ప్రెస్ తెలిపింది.
ఎన్నికల్లో ప్రకటించినట్లుగానే రోజుల వ్యవధిలోనే నాలుగు గ్యారెంటీలను సీఎం రేవంత్ రెడ్డి అమలు చేశారని ఇండియన్ ఎక్స్ ప్రెస్ ప్రస్తావించింది. గత పదేళ్లలో చేసిన బిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్త పరిస్థితుల్ని వెలికి తీయడంలో ప్రత్యేక చొరవ సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నారని పేర్కొన్నది.ఎన్నికల ప్రచారంలో “పవర్ ఫ్యాక్ట్ పొలిటికల్” స్పీచ్ లతో తెలంగాణలోని రాజకీయ నేతల్లో టైగర్ రేవంత్ ఒక పవర్ఫుల్ లీడర్ గా గుర్తింపు సంపాదించుకున్నారని వ్యాఖ్యానించింది. గులాబీ అధినేత కేసిఆర్ కంటే మాటల ప్రసంగాలు ఉపన్యాసాల్లో అధిక ప్రభావం కలిగించే వ్యక్తిగా రేవంత్ అవతరించారని పేర్కొన్నది. గత పాలనలో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దటం రేవంత్ రెడ్డికి సవాల్ వంటిదని ఇండియన్ ఎక్స్ ప్రెస్ సర్వే పేర్కొంది. గత ప్రభుత్వం అభ్యంతరంగా ఆపివేసిన ప్రాజెక్టులను కంటిన్యూ చేయడంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటూ బయటపడాల్సి ఉన్నదని పేర్కొన్నది.
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడం సాహసమేనని వ్యాఖ్యానించింది ఇండియన్ ఎక్స్ ప్రెస్. ఇదే క్రమంలో అత్యంత శక్తివంతమైన 100 మంది భారతీయుల జాబితాని గురువారం విడుదల చేసింది. ఈ లిస్టులో ప్రధాని మోదీ అగ్రస్థానంలో నిలిచారు. బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కెసిఆర్ టాప్ టెన్ లో కనిపించరు. కానీ ఇప్పుడు ఈ లిస్టులో కెసిఆర్ పేరు గయాబ్ అయ్యింది. దీంతో బారాసా శ్రేణులు నిరాశ చెందారు.ఇండియన్ ఎక్స్ ప్రెస్ 2024 లో ప్రచురించిన మోస్ట్ పవర్ఫుల్ ఇండియన్ లిస్టులో కెసిఆర్ సారుకు స్థానం దొరకలేదు. గతంలో బీజేపీతో కొట్లాడుతూ నేషనల్ పాలిటిక్స్ లో చక్రం తిప్పగలిగిన శక్తివంతుడు అంటూ 2023లో 35వ స్థానంలో స్థానం దక్కించుకున్నారు కెసిఆర్. అంతకుముందు 2022లో 38వ స్థానంలో ఉన్న కేసీఆర్ కు ఈసారి ప్లేస్మెంట్ లేకుండా పోయింది.