తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్‌గా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కి సీఎం రేవంత్ ఛాన్స్ ఇచ్చారు .. చైర్మన్‌తో పాటు సభ్యులుగా రమేశ్, సంకేపల్లి సుధీర్ రెడ్డి, నెహ్రూ నాయక్ లను నియమించారు .. వీరి పదవీ కాలం రెండేళ్ల పాటు ఉంటుంది. . ఇక ఇప్పటికే తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమీషన్ చైర్మన్ గా ఎంపికైన సిరిసిల్ల రాజయ్య బాధ్యతలు చేపట్టారు. లాహి కమీషన్ సభ్యులుగా ఎంపికైనా సంకేపల్లి సుధీర్ రెడ్డి, రమేష్ ముదిరాజ్, నెహ్రు నాయక్ సైతం బాధ్యతలు స్వీకరించారు.
గ్రామపంచాయితీలు ఆర్ధికంగా బలోపేతం కావాలని రాజీవ్ గాంధీ ఫైనాన్స్ కమీషన్స్ ఏర్పాటు చేశారని ఏ ఈసందర్భంగా రాజయ్య చెప్పుకొచ్చారు . గత ప్రభుత్వం ఫైనాన్స్ కమీషన్ ను నిర్విర్యం చేసిందని, నిధులు లేక గ్రామాలు, మున్సిపాలిటీలు అల్లాడుతున్నాయని అన్నారు. మూలన పడిన ఫైనాన్స్ కమీషన్ ను సీఎం పునరుద్దరించారని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు గ్రామాలను, మున్సిపాలిటీలను బలోపేతం చేస్తామన్నారు.సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీలో పని చేస్తూ వస్తోన్నారు సిరిసిల్ల రాజయ్య. 2009 నాటి ఎన్నికల్లో వరంగల్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2014లో కూడా వరంగల్ లోక్‌సభ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు .. గానీ ఓటమి పాలయ్యారు. బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి చేతిలో పరాజయాన్ని చవిచూశారు. అప్పటి నుంచి జిల్లా రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటూ వస్తోన్నారు.
గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేశారు. ఈ సారి లోక్ సభ కి పోటీ చేయాలనీ భావించారు .. అయితే అతనికి రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్‌గా అవకాశం ఇవ్వడంతో పోటీకి సూరం అయినట్టే ..దీనితో సీనియర్ నేత అద్దంకి దయాకర్ కి లైన్ క్లియర్ అయినట్టే అన్న టాక్ వినిపిస్తుంది .. అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి నుంచి పోటీ చేయాలనుకున్న అద్దంకి కి నిరాశే ఎదురయింది ..ఆ తర్వాత ఎమ్మెల్యే కోట ఎమ్మలేసి ఎన్నికలో ఆయనకి ఛాన్స్ ఖాయం అనుకున్నారు ..కానీ చివరి నిమిషంలో చేజారింది .. అలాగే రాజ్యసభ సైతం దక్కే ఛాన్స్ ఉందని ప్రచారం సాగింది .. అయితే అది జరగలేదు .. ఆయనకి వరంగల్ ఎంపీ సీటు ఇస్తామన్న హామీ ఇచ్చినట్టు ప్రచారం జరిగింది .. తాజాగా రాజయ్య కి కీలక పదవి ఇవ్వడంతో అద్దంకికి ఎంపీ సీటు ఇవ్వడం దాదాపు ఖరారైనట్టే అనే ప్రచారం సాగుతుంది ..దీనిపై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది ..