తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి మానవత్వం చాటుకున్నారు.అసెంబ్లీ ఎలక్షన్స్ తరువాత బాత్ రూమ్ లో కాలుజారి బిఆర్ స్ అధినేత కెసిఆర్ కింద పడిన విషయం తెలిసిందే . ఆ సమయంలో గులాబీ దళపతి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ యశోద ఆస్పత్రిలో తుంటి ఎముక శస్త్రచికిత్స జరిగిన విషయం మీ అందరికి తెలిసిందే .తుంటి ఎముక ఆపరేషన్ జరిగిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిని పరామర్శించడానికి యశోద హాస్పిటల్ కు వెళ్లారు. ఆ సయమంలో అస్పత్రి వద్ద ఓ మహిళ సీఎం రేవంత్ రెడ్డి ని రేవంతన్న అని ఆప్యాయంగా పిలిచింది. ఆ పిలుపు విని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆమె దగ్గరకు వెళ్ళి ఆమె సమస్య అడిగి తెలుసుకున్నారు.
నా బిడ్డల ఆసుపత్రి ఖర్చులు ఎక్కువఅవుతున్నాయని మానవత్వముతో మీరే ఆదుకోవాలి అన్న అని మహిళ చెప్పడంతో.. చలించిన సీఎం రేవంత్ రెడ్డి ఆమె సమస్యలు వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు .తాజాగా ట్విట్టర్ వేదికగా బ్లడ్ క్యాన్సర్ పేషెంట్ నవీన్ విషయంలో స్పందించారు సీఎం రేవంత్ అన్న .చిన్న వయసులోనే నవీన్ అరుదైన క్యాన్సర్‌తో పోరాడుతున్న సమస్య నా దృష్టికి వచ్చిందని ,తెలిసిన వెంటనే, నవీన్ కుటుంబ సభ్యుల్ని అధికారులు సంప్రదించారు అని , నవీన్ చికిత్సకు అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించానని , ప్రభుత్వమే అన్ని ఖర్చులు భరించి, చికిత్సకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను ప్రభుత్వమే చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
నవీన్ పూర్తిగా కోలుకునే అంతవరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిందిగా నిమ్స్ డైరెక్టరు డాక్టర్ యన్ బీరప్ప కు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి . నవీన్ ఈ క్యాన్సర్ మహమ్మారిని జయించి, పరిపూర్ణ ఆరోగ్యవంతుడిగ తిరిగి మన మధ్యకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా తెలిపారు. సీఎం దృష్టికి వెళ్లిన పేదవారి ఆరోగ్య సమస్యలు అర్ధం చేసుకుని మానవతాదృక్పదంతో పరిష్కరిస్తున్నారు అని తెలంగాణ ప్రజలు హర్షిస్తున్నారు .రేవంత్ రెడ్డి సీఎం పదవి అలంకరించిన తరువాత ,మానవతా దృక్పధంతో వారు చేసే మంచి కార్యక్రమాలకు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కార్యకర్తలు రేవంత్ రెడ్డి కాదు మా సీఎం మన సీఎం రేవంత్ అన్న అని పిలుస్తున్నారు .