Tuesday, December 3, 2024
spot_img
HomeDevotionalమారుతున్న టీ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు.. తెర పైకి కొత్త పేర్లు..

మారుతున్న టీ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు.. తెర పైకి కొత్త పేర్లు..

మారుతున్న టీ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు.. తెర పైకి కొత్త పేర్లు..?

ఢిల్లీ పర్యటనలో.. బిజీ బిజీగా సీఎం రేవంత్
ప్రియాంక సోనియా రాహుల్ లతో.. సీఎం రేవంత్ భేటీ
ఏఐసీసీ చీఫ్‌.. మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో
కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో పాల్గొన్న.. సీఎం రేవంత్
లోక్ సభ అభ్యర్థుల ఎంపిక పై.. కాంగ్రెస్ కసరత్తు
నేడో రేపో టీ కాంగ్రెస్.. ఎంపీ అభ్యర్థుల జాబితా విడుద

దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన క్రమంలో… తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా ఢిల్లీకి చేరింది. నేడు జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో లోక్ సభ అభ్యర్థుల అంశం పై చర్చించి ప్రకటన చేస్తారని తెలుస్తోంది. ముంబై లో భారత్ జోడో న్యాయ్ యాత్ర ముగింపు సభకు వెళ్లిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆ తర్వాత నేరుగా అక్కడి నుండి ఢిల్లీకి వెళ్లారు. హైదరాబాద్ నుంచి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేటి సమావేశం కోసం ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ ప్రియాంక గాంధీలతో సీఎం రేవంత్‌ భేటీ అయ్యారు. తెలంగాణలోని రాజకీయ పరిణామాలపై సోనియాకు రేవంత్‌ వివరించినట్లు తెలుస్తోంది. లోక్‌సభ అభ్యర్ధుల ఎంపికపైనా చర్చించినట్లు సమాచారం.

Changing Tea Congress MP candidates.. New names on the screen..?

పార్లమెంట్ ఎన్నికల కోసం ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నాలుగు లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అందులో మహబూబ్ నగర్, నల్లగొండ, మహబూబాద్, జహీరాబాద్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. మరో 13 స్థానాలను పెండింగ్ లో పెట్టారు. దాదాపు 10 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలని కాంగ్రెస్ అధిష్టానం భావించినప్పటికీ చివరి క్షణంలో ఏఐసీసీ పెండింగ్ లో పెట్టింది. చేవెళ్ల నుంచి సునీతా మహేందర్ రెడ్డిని బరిలోకి దింపాలని కాంగ్రెస్ భావించింది. అయితే ఆదివారం బిఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో చేవెళ్ల ఎంపీ అభ్యర్థి విషయంలో సీన్ మారిపోయింది. దీంతో చేవెళ్లలో సునీతా మహేందర్ రెడ్డి రంజిత్ రెడ్డిలో ఎవరు పోటీ చేస్తారన్నది తేలడం లేదు. సికింద్రాబాద్ టికెట్ ను బొంతు రామ్మోహన్ కు, మల్కాజ్ గిరి సీటును చంద్రశేఖ్ రెడ్డికి ఇస్తారని ప్రచారం జరిగింది. సునీల్ కనుగోలు సర్వేలో ఈ రెండు స్థానాలపై వెనుకడుగు పడినట్టు తెలుస్తోంది.

దీంతో అభ్యర్థుల వేట పై కసరత్తు జరుగుతుంది. సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి ఓటమే టార్గెట్ గా ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరిన బారాసా సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ను బరిలోకి దించాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారట. అదే నిజమైతే ఖమ్మం, నాగర్ కర్నూల్, మల్కాజ్ గిరి, భువనగిరి స్థానాలను అభ్యర్థుల ప్రకటన నేడు వస్తుందని భావించినప్పటికీ.. ఇవ్వాళ ఎంపీ అభ్యర్థుల ప్రకటన జరగకపోవచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నాలుగు స్థానాలను చివరి దాకా లాగి ఫ్లాష్​ సర్వే, అప్పటి పరిస్థితులను బేరీజు వేసుకున్న మీదటే ఫైనల్ చేస్తారనే చర్చ సాగుతోంది. పొత్తులో భాగంగా తమకు ఒక్క సీటైనా ఇవ్వాలని సీపీఐ అడుగుతోంది. దీనిపై ఏఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకోనుందనేది ఆసక్తికరంగా మారింది. పూర్తి స్థాయిలో క్లారిటీ కోసం ఆశావహులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఏదేమైనా అసెంబ్లీ ఎన్నికల మాదిరే లోక్ సభ ఎన్నికల్లో విజయం కోసం గెలుపు గుర్రాలను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments