Thursday, January 23, 2025
spot_img
HomeNewsAndhra PradeshPresident Murmu to Unveil NTR Commemorative Coin of Rs 100:

President Murmu to Unveil NTR Commemorative Coin of Rs 100:

 President Murmu to Unveil NTR Commemorative 100 Rs Coin:: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం  వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు చిత్రంతో ఆర్బీఐ ప్రత్యేకంగా రూపొందించిన 100 రూపాయల నాణేన్ని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సోమవారం  ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో పాలొనేందుకు ఎన్టీఆర్‌ కుటుంబసభ్యులు, తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఎన్టీఆర్​తో అనుబంధం ఉన్న పలువురు సీనియర్‌ నాయకులు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు.

ఈ కార్యక్రమం అనంతరం భారత ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయానికి చంద్రబాబు. వెళ్లి రాష్ట్రంలో ఓటరు జాబితా తయారీలో భారీగా బయటపడుతున్న అక్రమాలపై ఈసీకి ఫిర్యాదు చేస్తారు. తెలుగుదేశం పార్టీ  సానుభూతిపరుల ఓట్లను అడ్డగోలుగా తొలగింపుపై ఫిర్యాదు చేయనున్నారు. అలాగే  వైసీపీ అనుకూలంగా ఉన్న వారి ఓట్లను నిబంధనలకు విరుద్ధంగా చేరుస్తున్న ఉదంతాలను ఎన్నికల ప్రధాన కమిషనర్‌కు ఆధారాలతో సహా వివరించనున్నారు. ఇప్పటికే ఉరవకొండ, పర్చూరు, విజయవాడ సెంట్రల్, విశాఖ తదితర నియోజకవర్గాల్లో బయటపడ్డ అక్రమాలపై సాక్ష్యాలను సమర్పించనున్నారు. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments