న్యూ ఢిల్లీ : తెలంగాణలో అన్ని స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు నారా చంద్రబాబు నాయుడు . ఇప్పటికే పోటీపై కమిటీ వేశామని, అందువల్ల తెలంగాణలో బీజేపీతో (BJP) పొత్తుకు సమయం మించిపోయిందని చంద్రబాబు అన్నారు . ఇప్పటికే అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించేందుకు ఓ కమిటీని వేశారు .
ఏపీని ఎలా పునర్నిర్మించాలన్న ఆలోచనలో తాను ఉన్నట్లు తెలిపారు. బీజేపీతో అంతర్గతంగా ఏం చర్చిస్తున్నామనేది ఎవరికీ తెలియదన్నారు. తాను చూడని రాజకీయం లేదని.. దేశ నిర్మాణంలో భాగం కవాలన్నది తన ఉద్దేశ్యమని తెలిపారు. అది ఎలా అనేది కాలం నిర్ణయిస్తుందన్నారు.
ప్రత్యేక హోదా కోసమే ఎన్డీయే నుంచి బయటకు వచ్చినట్లు చెప్పుకొచ్చారు. ప్రత్యేక హోదా ప్రజల సెంటిమెంట్ అని అన్నారు. జగన్ ఏపీని సర్వం నాశనం చేశారని విమర్శించారు. జగన్ విధానాలవల్లే తెలంగాణకు, ఆంధ్రాకు పొంతన లేకుండా పోయిందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు
ఇంకా చంద్రబాబు ” మేం గేట్లు ఓపెన్ చేస్తే వైసీపీ విలీనమే.. రాజకీయ అనుభవంలో జగన్ బచ్చా: రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలోనే కేంద్రంతో విభేదించాను తప్ప.. ఏ విషయంలోనూ విభేదాలు లేవు . దిల్లీ పర్యటనలో భాగంగా జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. నాలుగేళ్లలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అక్రమాలు, జగన్ పాలనపై ధ్వజమెత్తారు.