విశాఖ లోని agm మైదానం లో ఇండియా , ఇండియన్స్ , తెలుగూస్ పేరుతొ ఒక విజన్ డాక్యుమెంట్ ను విడుదల చేశారు . అంతకు ముందు చంద్రబాబు నాయుడు విశాఖ RK బీచ్ రోడ్డులో 2.5 కమ్ జాతీయపతాకాన్ని పట్టుకొని వెలది మందితో కలసి తిరంగా పాదయాత్ర చేశారు . విశాఖ తీరం జనసంద్రాన్ని తలపించింది .
GFST చైర్మన్ హోదాలో చంద్రబాబు నాయుడు ఈ విజన్ డాక్యుమెంట్ కోసం సుదీర్ఘ కసరత్తు చేశారు . 2047 నాటికి భారదేశం స్వతంత్రం 100 ఏళ్ళు అవుతుందని అప్పటికి భారత్ సూపర్ పవర్ గా కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు .
- దేశంలో 1991లో ఆర్థిక సంస్కరణలు ప్రగతి కి బాటలు వేసాయి . నేను 1995లో ముఖ్యమంత్రినయ్యాను. అప్పటికే పీవీ నరసింహారావు అమలు చేసిన ఆర్థిక సంస్కరణలను రెండో జనరేషన్‌గా పట్టాలపైకి ఎక్కించాను. విద్యుత్ సంస్కరణలతో 2004 నాటికి మిగులు విద్యుత్ రాష్ట్రంగా చేశాం. జేగురుపాడులో గ్రీన్‌ఫీల్డ్ పవర్ ప్రాజెక్టు, హైదరాబాద్‌లో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం, ఓపెన్ స్కై విధానం ద్వారా ఎమిరేట్స్ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు తెప్పించాం. ఐటీ, ఫార్మా, బయో టెక్నాలజీ, ఫైనాన్స్, మానవ వనరులు ఇలా అన్ని రంగాల్లో సంస్కరణల ఫలితాలు తీసుకొచ్చాం’
- ప్రపంచ స్థాయికి భారతీయ ఎకానమీ..
- పరిశోధనకు పెద్దపీట: దేశంలో పరిశోధనలకు పెద్దపీట వేసి మనమే సాంకేతికలను ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలి. స్టార్ట్ అప్ లు ప్రోత్సహించాలి .
- ఇంధన భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి .
- దేశంలోని 37 ప్రధాన నదులను అనుసంధానం చేయడానికి జాతీయ నదుల అనుసంధాన ప్రాజెక్టును సత్వరం అమలు చేయాలి. నీటి కాలుష్యం తగ్గించాలి .
- ప్రతి కుటుంబ ఆర్థిక ప్రగతిని పర్యవేక్షిస్తూ.. ఆ కుటుంబంలోని సభ్యులకు అవకాశాలు కల్పిస్తే అన్ని కుటుంబాలూ అభివృద్ధి చెందుతాయి.
- ఈ విజన్ డాక్యుమెంట్ పై దెస వ్యాప్తం గా చర్చ మొదలైంది .