అఖిల భారత కాంగ్రెస్ నిర్ణయాత్మక CWC సమావేశాలకు హైదరాబాద్ లో తెలంగాణ కాంగ్రెస్ ఘనం గా ఏర్పాట్లు సిద్ధం చేసింది .
హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పర్యటించనున్నారు. రేపు 12:35 నిమిషాలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కి రాహుల్ వచ్చి నేరుగా తాజ్ కృష్ణ హోటల్‌లో CWC సమావేశంలో పాల్గొంటారు. 17వ తేదీన తుక్కుగూడ సభ అనంతరం శంషాబాద్ నుంచే రాత్రి 8:50 గంటలకు ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు.
తెలంగాణ కాంగ్రెస్ లో చేరికల జోరు నిరంతర ప్రక్రియలా కొన సాగుతోంది . ఈరోజు భువనగిరి నేత , తెలంగాణా ఉద్యమ కారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి కోమటిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు .
మానకొండూర్ మాజీ mla ఆరెపల్లి మోహన్ భారాసాకు రాజీనామా చేశారు .
కాంగ్రెస్ లో వైఎస్సార్టీపీ విలీనంపై వైఎస్ షర్మిల ఈరోజు కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో వైఎస్ షర్మిల చర్చలు .
తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఖండించారు.
ఐటీ రంగంలో పలు విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారని ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చంద్రబాబుపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మైనంపల్లి ఆగ్రహం.
చంద్రబాబు అక్రమ అరెస్టుపై మణిపూర్ ఉక్కు మహిళ ఇరోమ్ చాను షర్మిల (ఇరోమ్ చాను షర్మిల) స్పందించారు. బాబు విజన్ ఉన్న ప్రజా నాయకుడని కొనియాడారు. అలాంటి నేతను అక్రమ కేసులో ఇరికించి జైలుకు పంపడాన్ని యావత్ దేశం ఖండించాలన్నారు.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమ అరెస్టుపై రాయలసీమ స్టీరింగ్ కమిటీ కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి స్పందించారు. రాష్ట్రం లో శాడిజం మొదలైందని, రాజ్యాంగానికి లోబడి కాకుండా చేసిన ప్రమాణాలకు విరుద్ధంగా రాగద్వేషాలతో పాలన సాగుతోందని, అందులో భాగంగానే చాలా అనుభవం ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయడం అందుకు నిదర్శనమని దుయ్యబట్టారు.
సీఎం జగన్ రెడ్డి ఇలాఖాలో చంద్రబాబు అరెస్ట్ నిరసన జ్వాలలు రాజుకుంటున్నాయి. మేముసైతం బాబుతో.. అని పులివెందుల ప్రజలు . పులివెందుల నియోజకవర్గం చక్రాయపేట మండలం నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రం గండి ఆంజనేయ స్వామిఆలయానికి టీడీపీ శ్రేణులు, ప్రజలు పాదయాత్రగా బయలుదేరారు. పులివెందుల టీడీపీ ఇన్‌చార్జి బీటెక్ రవి ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణుల ప్రత్యేక పూజలు
ఏక వాక్యం తో భారాసా కు తుమ్మల నాగేశ్వర రావు రాజీనామా …