Saturday, December 21, 2024
spot_img
HomeNewsAndhra Pradeshబాబు ష్యూరిటీ- భవిష్యత్ గ్యారెంటీ: CBN జిల్లాల పర్యటన షురూ .!

బాబు ష్యూరిటీ- భవిష్యత్ గ్యారెంటీ: CBN జిల్లాల పర్యటన షురూ .!

అమరావతి : తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు . ఇప్పటికే యువనేత నారా లోకేష్ యువగళం పేరుతొ గోదావరి జిల్లాలో పాదయాత్రలో వున్నారు . బాబు ష్యూరిటీ భవిష్యత్ కు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 45 రోజుల పాటు పార్టీ కార్యకర్తలు, నేతలు ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు.

ఈ కార్యక్రమం లో భాగంగా 5వ తేదీ అనంతపురం జిల్లా రాయదుర్గం నుంచి పర్యటన ప్రారంభం . 5,6,7 తేదీల్లో అనంతపురం జిల్లాలోని రాయదుర్గం, కళ్యాణదుర్గం, గుంతకల్ నియోజకవర్గాల్లో వివిధ వర్గాల ప్రజలతో చర్చా కార్యక్రమాలు, సమావేశాలు, రోడ్ షోలు సభలు. 8, 9 తేదీల్లో కర్నూలు జిల్లాలో చంద్రబాబునాయుడు పర్యటన.

5 న హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 1 గంటకు బళ్లారి చేరుకోనున్న చంద్రబాబు నాయుడు స్థానిక తెలుగు వారు ఏర్పాటు చేసిన స్వర్గీయ నందమూరి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం రాయదుర్గం నియోజకవర్గంలో పర్యటనలో పాల్గొంటారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments